OG Movie: పవన్ కళ్యాణ్ OG మూవీకి బిగ్ షాక్
OG మూవీకి బిగ్ షాక్

OG Movie: 'ఓజీ' (OG) సినిమా విడుదలకు ముందు తెలంగాణ హైకోర్టు నుంచి చిత్రబృందానికి ఎదురుదెబ్బ తగిలింది. సినిమా టికెట్ల ధరల పెంపు, ప్రత్యేక ప్రీమియర్ షోలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో (GO)పై హైకోర్టు స్టే విధించింది. పవన్ కళ్యాణ్ నటించిన 'ఓజీ' సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన నేపథ్యంలో, నిర్మాతలు పెట్టుబడిని తిరిగి రాబట్టుకునేందుకు టికెట్ల ధరలను పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వ అనుమతి కోరారు. దీనికి స్పందించిన తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 19న ఒక జీవోను జారీ చేసింది. ఈ జీవో ప్రకారం సెప్టెంబర్ 24న రాత్రి 9 గంటలకు ఒక ప్రత్యేక షో నిర్వహించుకోవచ్చు. ఈ షో టికెట్ ధర ₹800 (జీఎస్టీతో కలిపి) వరకు ఉండవచ్చు.సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 4 వరకు సాధారణ షోల టికెట్ల ధరలను పెంచుకోవడానికి కూడా అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ₹100, మల్టీప్లెక్స్‌లలో ₹150 వరకు పెంచుకోవచ్చని పేర్కొంది. అయితే, ఈ జీవోను సవాల్ చేస్తూ మహేష్ యాదవ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు, ప్రభుత్వ ఉత్తర్వులపై తాత్కాలికంగా స్టే విధించింది. దీంతో టికెట్ ధరల పెంపునకు, ప్రత్యేక షోలకు అనుమతి నిలిచిపోయింది. ఈ తీర్పుతో, ఇప్పటికే పెరిగిన ధరలకు టికెట్లు బుక్ చేసుకున్న ప్రేక్షకులు గందరగోళానికి గురయ్యారు. ఈ నిర్ణయం సినిమా కలెక్షన్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.
