బెయిల్ పిటిషన్లు కొట్టివేత

Big Shock to iBomma Ravi: నాంపల్లి కోర్టులో ఐబొమ్మ రవికి బిగ్ షాక్ తగిలింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో రవిపై నమోదైన ఐదు వేర్వేరు కేసుల్లోనూ బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. అతడికి విదేశాల్లో పౌరసత్వం ఉందని, బెయిల్ ఇస్తే దేశం దాటి పోయే అవకాశం ఉందని పోలీసులు వాదించారు. వారి వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం రవి బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది. కేసు ప్రస్తుతం అత్యంత కీలకమైన దర్యాప్తు దశలో ఉందని, ఈ సమయంలో నిందితుడు బయట ఉంటే సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది.

రవికి చెందిన దాదాపు 7 బ్యాంకు ఖాతాలను పోలీసులు విచారణలో గుర్తించారు. అందులో సుమారు రూ.13.40 కోట్ల నగదు ఉన్నట్లు తేలింది. కేవలం బెట్టింగ్ ప్రకటనల ద్వారానే ఇతడు దాదాపు రూ.1.78 కోట్లు సంపాదించినట్లు పోలీసులు కస్టడీ రిపోర్టులో పేర్కొన్నారు. పైరసీ సినిమాలకు సంబంధించి నార్మల్ ప్రింట్‌లను $100 కి, హెచ్‌డీ (HD) ప్రింట్‌లను $200 కి ఇతడు కొనుగోలు చేసేవాడని వెల్లడైంది. ఈ కేసులో భారీగా నిధులు చేతులు మారినట్లు అనుమానిస్తున్నందున, ఇప్పటికే ED కూడా ఈ వ్యవహారంపై దృష్టి సారించింది.ప్రస్తుతం రవి చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కోసం పోలీసులు విదేశీ సర్వర్ల డేటాను కూడా విశ్లేషిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story