ముంబై, సెప్టెంబర్ 6, 2026 : ఇండియాలో అత్యంత పాపులర్ రియాలిటీ షోలలో ఒకటైన ''బిగ్ బాస్'' 20వ సీజన్‌ గ్రాండ్‌గా ప్రారంభమైంది. రెండు దశాబ్దాల బిగ్ బాస్ ప్రయాణాన్ని సెలబ్రేట్ చేస్తూ.. హోస్ట్ ''సల్మాన్ ఖాన్'' అదిరిపోయే పెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను అలరించారు. తన 38 ఏళ్ల సినీ ప్రయాణానికి సంబంధించిన ప్రత్యేక ఘట్టాలను గుర్తుచేస్తూ ఏకంగా ''20 ఐకానిక్ పాటలకు డ్యాన్స్'' చేసి గ్రాండ్ ప్రీమియర్‌కు మరింత జోష్ తీసుకొచ్చారు.

ఈ సీజన్‌లో 'తథాస్-టూ' అనే ప్రత్యేక థీమ్‌తో పాటు 'ఎక్స్‌ట్రా జీవన్ దాన్' అనే కాన్సెప్ట్‌ను పరిచయం చేశారు. దీంతో ఈసారి బిగ్ బాస్ హౌస్‌లో గేమ్ మరింత ఆసక్తికరంగా ఉండబోతోందనే ఆసక్తి నెలకొంది.

గ్రాండ్ ప్రీమియర్‌లో కంటెస్టెంట్లు ''కనికా మాన్, ఆమ్రపాలి దూబే, యంగ్ డీఎస్ఏ, ఉదితి సింగ్, మహి విజ్'' ప్రత్యేక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. తన కుమార్తె, కంటెస్టెంట్ ''రిథి తివారీ''కి మద్దతుగా నటుడు, రాజకీయ నాయకుడు ''మనోజ్ తివారీ'' వేదికపై సందడి చేశారు. అలాగే ఆమ్రపాలి దూబేకు మద్దతుగా ''దినేశ్ లాల్ యాదవ్ (నిరహువా)'' కూడా గ్రాండ్ ప్రీమియర్‌లో పాల్గొన్నారు.

మరోవైపు.. ప్రేక్షకుల ఓట్లతో కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టిన ''లవ్ గిల్'' కూడా ఈ సీజన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 'ఫ్యాన్స్ కా ఫైసలా' ద్వారా అత్యధిక ఓట్లు సాధించి ఆమె బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.

ఇక బిగ్ బాస్ 20లో మరో ప్రత్యేక క్షణం ''ఎం.సి. మేరీ కోమ్''ఎంట్రీతో చోటుచేసుకుంది. ఆమె బిగ్ బాస్ ప్రయాణానికి శుభాకాంక్షలు తెలుపుతూ ''ప్రియాంక చోప్రా'' ప్రత్యేకంగా గుడ్ లక్ మెసేజ్ పంపించారు.

17 మంది కంటెస్టెంట్లు.. విభిన్న ప్రపంచాల నుంచి ఎంట్రీ

ఈ సీజన్‌లో సినిమా, టెలివిజన్, స్పోర్ట్స్, సోషల్ మీడియా, డిజిటల్ రంగాలకు చెందిన విభిన్న వ్యక్తిత్వాలను బిగ్ బాస్ హౌస్‌లోకి తీసుకొచ్చారు.

''ఎం.సి. మేరీ కోమ్, ఆమ్రపాలి దూబే, ఉదితి సింగ్, అరిష్ఫా ఖాన్, అమన్ గాంధీ, ఖాజీ అహ్మద్ తౌకీర్, హర్ష్ మచారే అలియాస్ యంగ్ డీఎస్ఏ, కుశాల్ తన్వర్ అలియాస్ గుల్లు, రిహ్యా యాదవ్, లవ్ గిల్, రోహెడ్ ఖాన్, ఇషా రిఖీ, మహి విజ్, ఆసిఫ్ ఖాన్, రిథి తివారీ, కనికా మాన్, తన్మయ్ సింగ్ అలియాస్ స్కౌటాప్''.. ఇలా మొత్తం 17 మంది కంటెస్టెంట్లు ఈసారి బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టారు.

ప్రతి ఒక్కరి నేపథ్యం, వ్యక్తిత్వం, గేమ్ ఆడే విధానం భిన్నంగా ఉండటంతో.. ఈ సీజన్‌లో పోటీ మరింత రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తోంది.

మొత్తానికి.. ''20 సీజన్ల మైలురాయిని'' అందుకున్న బిగ్ బాస్‌.. సల్మాన్ ఖాన్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో గ్రాండ్‌గా ప్రారంభమైంది. కొత్త థీమ్, కొత్త కంటెస్టెంట్లు, కొత్త ట్విస్టులతో ఈ సీజన్ ప్రేక్షకులకు ఎలాంటి ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వబోతుందో చూడాలి.

Next Story