డబుల్ హౌస్.. డబుల్ జోష్

Bigg Boss This Season: తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభమైంది. 15 వారాల పాటు జరగనున్న ఈ బిగ్ హౌస్ లోకి మొత్తం 15 మంది అడుగుపెట్టారు. ఆరుగురు సామాన్యులు, 9 మంది సెలబ్రిటీలు లోపలికి వెళ్లారు. డబుల్ హౌస్, డబుల్ జోష్ (రెండు ఇళ్లు, రెట్టింపు ఉత్సాహం), ఈ సీజన్‌లో అత్యంత ఆకర్షణీయమైన అంశం ఇదే. మొదటిసారిగా, బిగ్ బాస్ హౌస్‌లో రెండు వేర్వేరు హౌస్ లు ఉన్నాయి. ఒక ఇల్లు చాలా విలాసవంతంగా, అన్ని సౌకర్యాలతో ఉంటుంది. మరొక ఇల్లు తక్కువ సౌకర్యాలు, కనీస వసతులతో ఉంటుంది.

ట్విస్ట్ ఏంటంటే.. మొదట అందరూ సెలబ్రిటీలు లగ్జరీ హౌస్‌లో ఉంటారని అనుకున్నారు, కానీ ప్రారంభ ఎపిసోడ్‌లోనే ఒక ట్విస్ట్ ఇచ్చారు. సాధారణ ప్రజలను లగ్జరీ హౌస్‌లోకి పంపగా, సెలబ్రిటీలు తక్కువ సౌకర్యాలు ఉన్న రెండో ఇంట్లో తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ అనూహ్యమైన మార్పు ఈ సీజన్‌ను మరింత ఆసక్తికరంగా మార్చింది.

సెలబ్రిటీలు వర్సెస్ కామన్‌మ్యాన్

ఈ సీజన్‌లో సెలబ్రిటీలతో పాటు సాధారణ ప్రజలు కూడా కంటెస్టెంట్లుగా పాల్గొన్నారు. అగ్నిపరీక్ష అనే ప్రీ-షో ద్వారా 6 మంది సాధారణ ప్రజలను ఎంపిక చేశారు, వారు సెలబ్రిటీలతో పోటీ పడుతున్నారు.

సాధారణ కంటెస్టెంట్లను ఎంపిక చేయడానికి "అగ్నిపరీక్ష" అనే ప్రత్యేకమైన ప్రీ-షోలో మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ బిందు మాధవి, నవదీప్, అభిజీత్ జడ్జ్‌లుగా వ్యవహరించారు. ఇందులో టాస్క్‌లు, కఠినమైన సవాళ్లు ఇచ్చి సాధారణ ప్రజలను పరీక్షించి ఎంపిక చేశారు. ఈ సీజన్ థీమ్ రణరంగం. దీని ట్యాగ్‌లైన్ "ఈసారి చదరంగం కాదు, రణరంగమే. ఈ సీజన్‌కు కూడా కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story