'Mera BIGG BOSS Hai Na' Salman Khan: 'ప్రమోషన్లు కావాలా? నా బిగ్ బాస్ ఉందిగా!'.. 19 సీజన్లు దాటినా తగ్గని క్రేజ్
రెండు దశాబ్దాలుగా ఇండియాలోనే నంబర్ 1 రియాలిటీ షో.. 'బిగ్ బాస్' దిగ్విజయ ప్రయాణంపై ప్రత్యేక కథనం!

భారతీయ బుల్లితెర చరిత్రలోనే అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో ఏది అంటే వెంటనే గుర్తుకువచ్చే పేరు 'బిగ్ బాస్'. 2006లో ఒక చిన్న సెలబ్రిటీ ప్రయోగంగా ప్రారంభమైన ఈ షో, నేడు 19 సీజన్లను పూర్తి చేసుకుని భారత్‌లోనే అతిపెద్ద నాన్-ఫిక్షన్ ఫ్రాంచైజీగా రికార్డు సృష్టించింది. బనిజే ఆసియా నిర్మిస్తున్న ఈ షో హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ భాషల్లో కలిపి ఏటా దాదాపు 40 కోట్ల మందికి పైగా వీక్షకులను ఆకట్టుకుంటోంది.
ఇటీవల జరిగిన IIFA ఈవెంట్‌లో బాలీవుడ్ సుల్తాన్, బిగ్ బాస్ హోస్ట్ సల్మాన్ ఖాన్ తనదైన శైలిలో స్పందిస్తూ "ఎవరికైనా పబ్లిసిటీ లేదా ప్రమోషన్లు కావాలంటే.. నా బిగ్ బాస్ ఉందిగా!" అంటూ సరదాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
JioHotstar విప్లవం: డిజిటల్ స్కీన్‌పై బిగ్ బాస్ హవా!
జియో-స్టార్ విలీనం తర్వాత బిగ్ బాస్ అన్ని భాషల ఎడిషన్లు ఇప్పుడు ఒకే ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్‌లో అందుబాటులోకి వచ్చాయి. 24x7 లైవ్ స్ట్రీమింగ్, అన్‌సీన్ కట్స్ మరియు ఓటీటీ వీక్షకులకు ప్రత్యేక ఎంగేజ్‌మెంట్ ఫీచర్లు తీసుకురావడంతో ఈ షో వాచ్-టైమ్ మరియు ప్రాంతీయ ఆదరణ రెట్టింపు అయ్యాయి.
సల్మాన్ ఖాన్: ఈ షోకి అసలైన బ్రాండ్ అంబాసిడర్!
సినీ విశ్లేషకులు, ఎడిటర్ భారతి దూబే బిగ్ బాస్ దిగ్విజయ ప్రయాణం గురించి మాట్లాడుతూ...
"బిగ్ బాస్ ఇన్ని ఏళ్లుగా విజయవంతంగా నడవడానికి ప్రధాన కారణం సల్మాన్ ఖాన్. వెండితెరపై కనిపించే సల్మాన్‌కి, బిగ్ బాస్‌లో కనిపించే సల్మాన్‌కి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇక్కడ ప్రేక్షకులు ఆయనలోని అసలైన మనిషిని, ఆయన భావోద్వేగాలను చూస్తారు.
హౌస్‌లో ఉండే కంటెస్టెంట్లు ఎవరైనా, ఎంత పెద్ద స్టార్స్ అయినా కాకపోయినా.. శని, ఆదివారాల్లో సల్మాన్ వచ్చే 'వీకెండ్ కా వార్' ఎపిసోడ్ల కోసమే కోట్లాది మంది ఎదురుచూస్తారు. అన్ని వయసుల వారినీ కనెక్ట్ చేసే అరుదైన మ్యాజిక్ సల్మాన్ సొంతం."
అడ్వర్టయిజర్ల కేరాఫ్ అడ్రస్: 'కాంట్రవర్సీ + సెలబ్రిటీ + కమ్యూనిటీ'
ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ నరేందర్ గుప్తా అభిప్రాయంలో బిగ్ బాస్ కేవలం ఒక షో మాత్రమే కాదు, అడ్వర్టైజర్లకు ఒక పెద్ద మీడియా ప్లాన్.
మల్టీ-ప్లాట్‌ఫామ్ రివన్యూ : టీవీ స్పాన్సర్‌షిప్‌లు, ఓటీటీ ప్రీ-రోల్స్, కనెక్టెడ్ టీవీ ఇంటిగ్రేషన్లు, ప్రోడక్ట్ ప్లేస్‌మెంట్‌లు మరియు సోషల్ మీడియా కాంపెయిన్ల ద్వారా ప్రకటనకర్తలకు ఇది బెస్ట్ వేదిక.
హిట్ ఫార్ములా : వివాదం + సెలబ్రిటీ + కమ్యూనిటీ అనే సూత్రమే బిగ్ బాస్‌ను ఇప్పటికీ నంబర్ 1 స్థానంలో నిలబెట్టింది.
కొత్త ట్విస్టులతో సల్మాన్ గ్రాండ్ అనౌన్స్‌మెంట్!
ప్రతి సీజన్‌లోనూ కొత్తదనాన్ని తీసుకొచ్చే ప్రయత్నంపై సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ:
"బిగ్ బాస్ ప్రతి సీజన్ ఒక కొత్త గేమ్, సరికొత్త డైనామిక్స్ మరియు ఊహించని మలుపులతో వస్తుంది. కానీ ఈసారి షో కేంద్రంగా ఉన్న ఒక రహస్యమైన మిస్టరీ ఈ సీజన్‌ను మునుపెన్నడూ చూడని విధంగా మార్చబోతోంది!"
రెండు దశాబ్దాలు పూర్తి కావస్తున్నా, సరికొత్త ఐడియాలతో, డిజిటల్ కంటెంట్‌తో దూసుకుపోతున్న 'బిగ్ బాస్' రాబోయే రోజుల్లో ఇంకెన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలి!

