Biker Movie: ఇండియా మొత్తం మాట్లాడుకునే గొప్ప సినిమా బైకర్
గొప్ప సినిమా బైకర్

Biker Movie: శర్వానంద్ హీరోగా నటించిన యాక్షన్ డ్రామా ‘బైకర్’. మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటించగా, రాజశేఖర్ కీలక పాత్ర పోషించారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. ఏప్రిల్ 3న సినిమా విడుదల కానుంది. ఆదివారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. అతిథులుగా హాజరైన నిర్మాతలు దిల్ రాజు, బన్నీ వాస్ సినిమా సక్సెస్ సాధించాలని కోరుతూ టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ ‘ఇండియా మొత్తం మాట్లాడుకునే గొప్ప సినిమా ఇది.
ఈ చిత్రంతో మరోసారి బ్లాక్ బస్టర్ కొడుతున్నా’ అని అన్నాడు. మంచి క్యారెక్టర్ చేయడం ఆనందంగా ఉందని రాజశేఖర్ అన్నారు. ఈ చిత్రంలో డైరెక్టర్ తనను డిఫరెంట్‌గా ప్రెజెంట్ చేశారని హీరోయిన్ మాళవిక నాయర్ చెప్పింది. డైరెక్టర్ అభిలాష్ మాట్లాడుతూ ‘ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా 1990–2000 రెండు టైమ్ లైన్స్‌లో జరుగుతుంది. మేము వాడిన బైక్స్ కూడా చాలా ప్రామాణికంగా ఉంటాయి. ప్రతి రేస్ సీన్ వెనుక ఒక మంచి ఎమోషన్ ఉంటుంది. ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఆడియెన్స్‌కు కనెక్ట్ అవుతుంది’ అని చెప్పాడు. సినిమా విజయంపై కాన్ఫిడెంట్‌గా ఉన్నామని నిర్మాత వంశీ అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్, డిఓపి జే యువరాజ్ పాల్గొన్నారు.

