బుల్లెట్ సునీల్ గా రాజశేఖర్

'Biker' movie: శర్వానంద్ హీరోగా అభిలాష్ కంకర తెరకెక్కిస్తున్న చిత్రం బైకర్'. మాళవిక నాయర్ హీరోయిన్. రాజశే ఖర్ ఈ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. బుధవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా తన పాత్రను పరిచయం చేస్తూ వీడియో గ్లింప్స్న విడుదల చేశారు. ఇందులో ఆయన బుల్లెట్ సునీల్ అనే కోచ్ గా కనిపించారు. "మాజీ మోటోక్రాస్ రేసర్. అప్పట్లో బుల్లెట్ సునీల్ అనేవారు. 18 ఇండియన్ ఛాంపియన్ షిప్స్, 57 సౌత్ జోన్ టైటిల్స్, 100కుపైగా రేస్లు.." అంటూ తన పాత్రను పరిచయం చేసిన తీరు ఆకట్టుకుంది. "ఇండియన్ రేసర్స్ డిజర్వింగ్ కాదు.. జస్ట్ లూజర్స్ అనే ఒపీనియన్ ఉంది" అంటుంటే.. ఒపీనియనే కదా మారుద్దాం అంటాడు రాజశేఖర్, బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. జె. యువరాజ్ సినిమాటోగ్రాఫర్. యూవీ క్రియేషన్స్ బ్యానర్పై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 3న సినిమా విడుదల కానుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story