నిర్వాహకులపై నిహారిక ఫైర్..

Filmfare Event: కొచ్చి వేదికగా అత్యంత వైభవంగా జరిగిన 70వ ఫిలింఫేర్ సౌత్ అవార్డ్స్ వేడుకలో మెరిసిన తారల సందడి ఒకవైపు ఉంటే, నిర్వహణ లోపాలపై వినిపిస్తున్న విమర్శలు మరోవైపు చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా నటి అంజలి, నిర్మాత నిహారిక కొణిదెల ఈ వేడుక పట్ల తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటి అవార్డు గెలుచుకున్న అంజలికి ప్రారంభంలోనే ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది.

అవార్డు అందుకోవడానికి కొచ్చి చేరుకున్న అంజలిని ఆహ్వానించేందుకు ఫిలింఫేర్ ప్రతినిధులు ఎవరూ రాలేదని సమాచారం. దాదాపు 40 నిమిషాల పాటు ఆమె ఎయిర్‌పోర్ట్‌లో వేచి ఉండాల్సి రావడంతో, నిర్వాహకుల సమన్వయ లోపంపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

కొత్త టాలెంట్‌ను చిన్నచూపు చూశారా? - నిహారిక ప్రశ్న

మరోవైపు మెగా వారసురాలు, నిర్మాత నిహారిక కొణిదెల కూడా సోషల్ మీడియా వేదికగా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆమె నిర్మించిన కమిటీ కుర్రోళ్లు చిత్రానికి రెండు అవార్డులు దక్కాయి. అయితే అవార్డుల ప్రదానోత్సవంలో జరిగిన తీరు ఆమెను బాధించింది."తొలిసారి అవార్డులు అందుకునే కొత్త ప్రతిభను ప్రోత్సహించడంలో ఫిలింఫేర్ విఫలమైంది. స్టేజీపై వారికి కనీసం ఒక్క నిమిషం కూడా మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం దురదృష్టకరం" నిహారిక కొణిదెల ఫైర్ అయ్యారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story