Bobby Kolli–Chiranjeevi Project: మెగా ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే వార్త! 'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత.. మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ ఇప్పుడు శరవేగంగా పట్టాలెక్కుతోంది. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం రాకెట్ స్పీడ్‌తో సాగుతున్నాయి.

ఈ సినిమాలో మెగాస్టార్ అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. చిరు ఇందులో రెండు విభిన్నమైన పాత్రల్లో నటించనున్నట్లు సమాచారం. దీంతో ఆయన మేకోవర్ , లుక్స్‌పై మేకర్స్ అత్యంత ప్రత్యేక శద్ధ పెడుతున్నారు. ఆ వింటేజ్ చిరుని మళ్ళీ వెండితెరపై చూపించేందుకు బాబీ టీమ్ పక్కా ప్లానింగ్‌తో ఉంది.

గత రెండు రోజులుగా చిరంజీవితో ప్రత్యేకంగా ఫొటో షూట్స్ నిర్వహిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. ఈ ఫొటో షూట్ ద్వారా రెండు పాత్రలకు సంబంధించిన లుక్స్‌ను చిత్ర యూనిట్ త్వరలోనే లాక్ చేయనుంది. అన్నీ కుదిరితే వచ్చే నెలలోనే ఈ మెగా మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మరి ఈసారి బాబీ మెగాస్టార్‌ను ఏ రేంజ్‌లో చూపించబోతున్నారో? ఆ రెండు పాత్రల వెనుక ఉన్న సర్ ప్రైజ్ ఏంటో? తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే!

PolitEnt Media

PolitEnt Media

Next Story