మరో సీనియర్ నటుడు

Bollywood Actor Govinda: బాలీవుడ్ నటుడు గోవిందా ఆస్పత్రిలో చేరారు. నవంబర్ 11న మంగళవారం అర్థరాత్రి తర్వాత ఆయన స్పృహ కోల్పోయారు. వెంటనే ఆయనను ముంబైలోని జుహులో ఉన్న క్రిటికేర్ ఏషియా మల్టీస్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు.గోవిందాకు టెస్టులు చేశారు డాక్టర్లు. రిజల్ట్ వస్తేగానే అనారోగ్యం పరిస్థితి తెలియదు. ప్రస్తుతం గోవింద ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారని ఆయన స్నేహితుడు,న్యాయ సలహాదారు అయిన లలిత్ బిందాల్ తెలిపారు.

గోవిందా ఇంట్లో అర్థరాత్రి కుప్పకూలారు. ఆసుపత్రికి తరలించే ముందు టెలిఫోన్ ద్వారా వైద్యుడిని సంప్రదించి అతనికి మందులు ఇచ్చారు. తెల్లవారుజామున 1 గంటలకు అత్యవసరంగా ఆసుపత్రిలో చేర్చారని బిందాల్ ధృవీకరించారు.

గోవింద గతంలో అక్టోబర్ 2024లో ఆయన ఇంట్లో ప్రమాదవశాత్తు తుపాకీ పేలి కాలుకి బుల్లెట్ గాయం కావడంతో కూడా ఆసుపత్రిలో చేరారు. మోకాలి కింద గాయంతో జుహులోని తన ఇంటికి సమీపంలోని క్రిటికేర్ ఆసుపత్రికి తరలించారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేర్చబడ్డారు. గంటసేపు శస్త్రచికిత్స తర్వాత బుల్లెట్‌ను బయటకు తీశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story