నాకు మస్త్ హెల్ప్ అయ్యింది- అనన్య

Bollywood actress Ananya Pandey: యువతను ఆకట్టుకునే కథలతో ప్రేక్షకుల్ని మెప్పిస్తున్న బాలీవుడ్ నటి అనన్య పాండే.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో అగ్ర కథానాయకుడు షారుక్ ఖాన్ తనకు ఇచ్చిన సలహా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సలహా తన నటనా నైపుణ్యాల్ని మెరుగుపరిచిందని ఆమె అన్నారు. త్వరలో కార్తీక్ ఆర్యన్‌తో కలిసి తూ మేరీ మై తేరా తూ మేరీ చిత్రంతో అనన్య ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఒక చనిపోయిన వ్యక్తి గురించి బాధపడే సన్నివేశంలో సహజంగా భావోద్వేగాలను పండించడానికి షారుక్ ఖాన్ ఇచ్చిన సూచనను గుర్తు చేసుకున్నారు.

షారుక్ ఖాన్ ఇచ్చిన సలహా ఇదే

"ఏదైనా సినిమాలో ఎవరైనా మరణించే సన్నివేశంలో ఉన్నప్పుడు.. ఆ వ్యక్తి చనిపోయాడని ఆలోచించే బదులు.. అతను లేకుండా జీవితం ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఆ వ్యక్తితో గడిపిన సంతోషకరమైన క్షణాల్ని గుర్తుతెచ్చుకోండి. అది మిమ్మల్ని బాధపెడుతుంది. అప్పుడు తెరపై భావోద్వేగాలు సహజంగా కనిపిస్తాయి." అని చెప్పినట్లు గుర్తు చేసుకుంది.

షారుక్ ఖాన్ చెప్పిన ఈ ఎమోషనల్ టెక్నిక్ తనకు బాగా ఉపయోగపడిందని అనన్య చెప్పుకొచ్చారు. ఈ సలహా తన నటనను, ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో మరింత సహజంగా ఉండేందుకు సహాయపడిందని తెలిపారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story