Actress Kirti Kulhari: సైబర్ నేరగాళ్ల పంజా ఈసారి ప్రముఖ బాలీవుడ్ నటి, నిర్మాత కీర్తి కుల్హారిపై పడింది. ఆమె అనుమతి లేకుండా, కనీసం రహస్య వివరాలు ఎవరికీ చెప్పకుండానే ఆమె క్రెడిట్ కార్డు నుంచి రూ. 2,43,852 ఆన్‌లైన్ లావాదేవీలు జరిగాయి. ఈ సైబర్ మోసంపై అప్రమత్తమైన కీర్తి కుల్హారి ముంబైలోని అంబోలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, సైబర్ సెల్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.

సినిమా థియేటర్ వద్ద ఊహించని షాక్

జూలై 24 రాత్రి అంధేరి వెస్ట్‌లోని ఒక మల్టీప్లెక్స్ వద్ద ఉన్న సమయంలో కీర్తి మొబైల్ ఫోన్‌కు బ్యాంకు నుండి ఒక అలర్ట్ మెసేజ్ వచ్చింది. 'ఏరోమెక్సికో ఎయిర్‌లైన్స్ కోసం ఆమె క్రెడిట్ కార్డు ద్వారా 2,525 అమెరికన్ డాలర్ల విలువైన టికెట్లు, లావాదేవీలు జరిగినట్లు అందులో ఉంది.ఆ సందేశం చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైన ఆమె వెంటనే బ్యాంక్ కస్టమర్ కేర్‌ను సంప్రదించారు. బ్యాంక్ అధికారులు ఖాతాను పరిశీలించగా, కేవలం నిమిషాల వ్యవధిలోనే నాలుగు అనధికారిక ట్రాన్సాక్షన్స్ ద్వారా రూ. 2.43 లక్షలకు పైగా మాయమైనట్లు తేలింది. మరింత నష్టం జరగకుండా బ్యాంక్ అధికారులు ఆ క్రెడిట్ కార్డును తక్షణమే బ్లాక్ చేశారు.

రహస్య వివరాలు ఇవ్వకపోయినా మోసం

తాను తన క్రెడిట్ కార్డు పిన్ (, పాస్‌వర్డ్ లేదా ఓటీపీ వంటి వివరాలను ఎవరితోనూ పంచుకోలేదని నటి కీర్తి పోలీసులకు తెలిపారు. నేరగాళ్లు స్పైవేర్ లేదా మాల్వేర్ సహాయంతో ఫోన్ డేటాను లేదా కార్డు వివరాలను హ్యాక్ చేసి ఉంటారని సైబర్ క్రైమ్ పోలీసులు భావిస్తున్నారు.

పింక్, యూరి: ది సర్జికల్ స్ట్రైక్, మిషన్ మంగళ్ వంటి చిత్రాలతో పాటు ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్, స్కూప్ వంటి వెబ్ సిరీస్‌ల ద్వారా కీర్తి కుల్హారి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సెలబ్రిటీ స్థాయి వ్యక్తులకు కూడా ఇలాంటి సైబర్ మోసాలు ఎదురవుతుండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story