బిగ్‌బాస్‌-13 ఫేమ్‌, బాలీవుడ్‌ నటీ షెఫాలీ జరీవాలా శుక్రవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. ఆమె వయసు 42 సంవత్సరాలు. శుక్రవారం రాత్రి షెఫాలీ తీవ్ర అస్వస్ధతకు గురవడంతో భర్త పరాగ్‌ త్యాగి ఆమెను వెంటనే అంధేరీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకు వెళ్లాడు. షెఫాలీని పరీక్షించిన వైద్యులు ఆమో అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. పోస్టుమార్టమ్‌ నిమిత్తం షెఫాలీ మృతదేహాన్ని కూపర్‌ ఆసుపత్రికి తరలించారు. షెఫాలీ జరీవాలా ఆకస్మిక మృతి వార్త తెలిసి బాలీవుడ్‌ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 2002లో వచ్చిన కాంటా లగా ఐటమ్‌ సాంగ్‌తో షెఫాలీ జరీవాలా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఈ ఐటమ్‌ సాంగ్‌ తో వచ్చిన గుర్తింపు వల్లే ముజ్‌సే షాదీ కరోగి చిత్రంలో షెఫాలీకి అవకాశం వచ్చింది. సౌత్‌ ఇండియన్‌ సినిమాలో కూడా షెఫాలీ నటించారు. కన్నడ భాషలో వచ్చిన హుడుగరు మూవీలో ఆమె నటించారు. అలాగే పలు వెబ్‌ సిరీస్‌లలో కూడా షెఫాలీ నటించారు. ఆమె నటించిన బేబీ కమ్‌నా అనే వెబ్‌ సిరీస్‌ బాగా పాపులర్‌ అయ్యింది. ఇక ఫేమస్‌ రియాలిటీ షో బిగ్‌బాస్‌ చరిత్రలోనే అత్యంత ప్రజాదరణ పొందిన 13వ సిరీస్‌ లో షెఫాలీ జరీవాలా కూడా పాల్గొన్నారు. ఇదే సిరీస్‌లో పాల్గొని విజేతగా నిలిచిన సిద్ధార్ధ్‌ శుక్ల కూడా గుండపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు షెఫాలీ జరీవాలా కూడా గుండెపోటు కారణంగా మరణించడంతో బాలీవుడ్‌ తో పాటు హిందీ టెలివిజన్‌ పరిశ్రమలో కూడా విషాదఛాయలు అలుముకున్నాయి.

Politent News Web 1

Politent News Web 1

Next Story