Bollywood Badshah Shah Rukh Khan: మాస్.. మాస్.. మాస్! అల్లు అర్జున్ పోస్టర్‌పై బాద్‌షా ప్రశంసలు
అల్లు అర్జున్ పోస్టర్‌పై బాద్‌షా ప్రశంసలు

Bollywood Badshah Shah Rukh Khan: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో వస్తున్న 'రాకా' మూవీ అనౌన్స్‌మెంట్ నుండి అంచనాలు ఆకాశాన్ని తాకాయి. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన బన్నీ 'రాకా' లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
కేవలం అభిమానులే కాదు, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ సైతం బన్నీ లుక్‌కు ఫిదా అయిపోయారు. అల్లు అర్జున్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, షారుఖ్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. "బన్నీ.. మీలాగే మీ పోస్టర్ కూడా అద్భుతంగా ఉంది. మీ ఇద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న 'రాకా' కోసం నేను కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను" అంటూ షారుఖ్ ప్రశంసలు కురిపించారు.
షారుఖ్ ఖాన్ తన పోస్ట్‌లో అట్లీ స్టైల్‌ను గుర్తుచేస్తూ ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. "ఈ ఎక్స్‌పీరియన్స్ అట్లీ మాటల్లో చెప్పాలంటే.. మాస్.. మాస్.. మాస్!!" అంటూ సినిమా రేంజ్‌ను చెప్పకనే చెప్పారు. ఒక టాప్ స్టార్ ఇంకొక స్టార్ హీరో సినిమా పోస్టర్‌ను షేర్ చేస్తూ, ఇంతలా సపోర్ట్ చేయడం చూస్తుంటే.. ఇండియన్ సినిమా దగ్గరవుతున్న తీరు స్పష్టంగా కనిపిస్తోంది.
నిజానికి అట్లీకి, షారుఖ్‌కు మధ్య ఒక స్పెషల్ బాండింగ్ ఉంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘జవాన్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఆ బ్లాక్‌బస్టర్ తర్వాత, అట్లీ ఇప్పుడు అల్లు అర్జున్‌ను ఎలా ప్రెజెంట్ చేయబోతున్నారో అన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది.పుష్పతో నేషనల్ వైడ్ క్రేజ్ సంపాదించిన బన్నీ.. ఇప్పుడు అట్లీ విజన్‌తో ‘రాకా’గా ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడో చూడాలి. షారుఖ్ ఖాన్ చెప్పినట్టుగా ఇది పక్కా ‘మాస్’ ఎంటర్టైనర్ కాబోతుందని అర్థమవుతోంది.

