Bollywood Hero Aamir Khan: వాళ్లపై ప్రేమ తగ్గలేదు..కానీ 60 ఏళ్ల వయసులో గర్ల్ ఫ్రెండ్ దొరకడం అదృష్టం
60 ఏళ్ల వయసులో గర్ల్ ఫ్రెండ్ దొరకడం అదృష్టం

Bollywood Hero Aamir Khan: రీనా దత్తా, కిరణ్ రావుతో డైవర్స్ తీసుకుని భార్యాభర్తలుగా విడిపోయామే తప్పా మనుషులుగా కాదని బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ అన్నారు. వారంటే ప్రేమ, గౌరవం ఉన్నాయన్నారు. భార్యాభర్తలుగా కాకుండా, ఉమ్మడి తల్లిదండ్రులుగా (Co-parents) సహచరులుగా ఉన్నామన్నారు.విడాకులు తీసుకున్నప్పటికీ, కిరణ్ రావుతో, తమ కుమారుడు ఆజాద్‌తో కలిసి ఒకే కుటుంబం లాగా ఉన్నామని, పానీ ఫౌండేషన్ వంటి ప్రాజెక్టులలో కలిసి పని చేస్తూనే ఉన్నామని స్పష్టం చేశారు. తన మాజీ భార్యలు అద్భుతమైన వ్యక్తులు. వారిపై నా గౌరవం తగ్గలేదు. నేను వారి కుటుంబ సభ్యులకు కూడా చాలా దగ్గరగా ఉన్నాను" అని ఆయన తెలిపారు.
‘రీనా అద్భుతమైన వ్యక్తి. మేం భార్యాభర్తలుగా విడిపోయాం, కానీ మనుషులుగా విడిపోలేదు. ఆమె పట్ల నా హృదయంలో చాలా ప్రేమ, గౌరవం ఉన్నాయి.కిరణ్ విషయంలోనూ అంతే. ఆమె అద్భుతమైన వ్యక్తి. మేం భార్యాభర్తలుగా విడిపోవాలని నిర్ణయించుకున్నాం, కానీ మేము కుటుంబం.రీనా, ఆమె తల్లిదండ్రులు, కిరణ్, ఆమె తల్లిదండ్రులు, మా తల్లిదండ్రులు. మేమంతా నిజానికి ఒకే కుటుంబంలా ఉన్నాం’ గర్ల్ ఫ్రెండ్ గౌరీ నా జీవితంలో చాలా శాంతిని, స్థిరత్వాన్ని తీసుకువచ్చింది. ఆమె నిజంగా అద్భుతమైన వ్యక్తి. నేను ఆమెను కలవడం నా అదృష్టం. 60 ఏళ్ల వయస్సులో నేను మళ్లీ ప్రేమ దొరుకుతుందనుకోలేదు. అని అమీర్ అన్నారు.
భారతదేశంలో వివాహ వ్యవస్థను చాలా సీరియస్‌గా చూస్తారని, విడాకులు తీసుకున్నప్పుడు ప్రజలు ఇష్టపడరని తనకు తెలుసు అని, కానీ తాను ప్రపంచానికి అబద్ధం చెప్పి సంతోషంగా ఉన్నట్లు నటించలేనని, అందుకే సత్యాన్ని చెప్పాలని నిర్ణయించుకున్నానని వివరించారు.

