తొలిసారి నేషనల్ అవార్డ్

Bollywood Hero Shahrukh Khan: బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్‌ ఇప్పటి ఎన్నో్ అవార్డులు,ప్రశంసలు అందుకున్నారు. తన 33 ఏళ్ల సినీ కెరీర్ లో టాప్ హీరోగా కొనసాగుతోన్న ఇంత వరకు జాతీయ అవార్డ్ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది.ఇన్నాళ్లకు 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ నటుడిగా షారూఖ్ కు ను అవార్డు వరించింది.

జవాన్ సినిమాలో షారుఖ్ ఖాన్ తన సుదీర్ఘ సినీ కెరీర్‌లో గెలుచుకున్న మొట్టమొదటి జాతీయ పురస్కారం. సుమారు 33 ఏళ్ల నట జీవితం తర్వాత ఈ అవార్డు రావడం విశేషం. జవాన్ సినిమాలో తండ్రీకొడుకులైన ద్విపాత్రాభినయంలో షారుఖ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. అందుకే ఈ అవార్డుకు ఆయన అర్హుడని చాలామంది ప్రశంసించారు. బెస్ట్ యాక్టర్ అవార్డుకు షారుఖ్ తో పాటు 12 th ఫెయిల్ హీరో విక్రాంత్ మాస్సే పోటీలో నిలిచారు. దీంతో ఇద్దరినీ కలిపి ఉత్తమ నటులుగా ప్రకటించింది కేంద్రం.

షారుఖ్ ఖాన్ దేశంలోనే అత్యంత ప్రసిద్ధ నటులలో ఒకరు. ఆయనను 'బాలీవుడ్ బాద్షా' అని, 'కింగ్ ఖాన్' అని కూడా పిలుస్తారు. 1965 నవంబర్ 2 లో జన్మించిన షారూఖ్ తన కెరీర్‌ను 1980ల చివరలో టెలివిజన్ ధారావాహికల ద్వారా ప్రారంభించారు. ఫౌజీ అనే సీరియల్ ఆయనకు మొదటి గుర్తింపు తెచ్చిపెట్టింది. 1992లో దీవానా చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం షారూఖ్ భుజానికి గాయం కావడంతో చికిత్స కోసం అమెరికా వెళ్లినట్లు సమాచారం. నేషనల్ అవార్డ్ గెలుచుకున్న తర్వాత అభిమానుల కోసం ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు షారూఖ్.

PolitEnt Media

PolitEnt Media

Next Story