Actor Nana Patekar: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. తనదైన విలక్షణ నటన, డైలాగ్ డెలివరీతో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న లెజెండరీ నటుడు నానా పటేకర్ కన్నుమూశారు. గోవాలోని తన స్వగృహంలో గుండెపోటు రావడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. తన నివాసంలో ఉన్న సమయంలో నానా పటేకర్ తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి ఆయన్ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సుమారు 45 నిమిషాల పాటు ఆయన ప్రాణాలను కాపాడేందుకు తీవ్రంగా శ్రమించినప్పటికీ ఫలితం దక్కలేదు. తెల్లవారుజామున 5:20 గంటలకు ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆయన హఠాన్మరణ వార్తతో చిత్ర పరిశ్రమ, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.

సినీ ప్రస్థానం.. మరపురాని పాత్రలు

1978లో వచ్చిన గమన్ సినిమాతో బాలీవుడ్ వెండితెరకు పరిచయమైన నానా పటేకర్, అనతికాలంలోనే తన ప్రత్యేక శైలితో తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నారు. పరిందా, అబ్ తక్ ఛప్పన్, యశ్వంత్, వజూద్ వంటి చిత్రాల్లో ఆయన అభినయం దేశవ్యాప్తంగా ప్రేక్షకులను కట్టిపడేసింది. 2000 దశకంలో వచ్చిన శక్తి: ది పవర్', అపహరణ్, టాక్సీ నెం 9211 చిత్రాల్లోని నటనకు ప్రశంసలు దక్కాయి. రాజ్‌నీతి చిత్రంలో ఆయన పోషించిన పాత్ర ఫిలింఫేర్ నామినేషన్ తెచ్చిపెట్టింది. కేవలం సీరియస్, ఇంటెన్స్ పాత్రలే కాకుండా కామెడీలోనూ తానేంటో నిరూపించారు. ముఖ్యంగా వెల్కమ్, వెల్కమ్ బ్యాక్ సినిమాల్లో ఆయన చేసిన ఉదయ్ శెట్టి క్యారెక్టర్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

జాతీయ అవార్డులు.. విలక్షణ ప్రతిభ

తన సుదీర్ఘ నట ప్రస్థానంలో నానా పటేకర్ మూడు జాతీయ చలనచిత్ర అవార్డులను అందుకున్నారు. 2016లో విడుదలైన మరాఠీ చిత్రం నటసామ్రాట్ లో ఆయన కనబరిచిన అద్భుత నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నటుడి పురస్కారం వరించింది. కేవలం నటనకే పరిమితం కాకుండా యశ్వంత్, వజూద్, ఆంచ్ వంటి పలు చిత్రాల్లో నేపథ్య గాయకుడిగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు. ఒక గొప్ప నటుడిని కోల్పోవడంతో భారతీయ సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Next Story