బాలీవుడ్ స్టార్ బ్యూటీ..

‘Tumbbad’: ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక కల్ట్ క్లాసిక్ హారర్ థ్రిల్లర్‌గా నిలిచిన చిత్రం ‘తుంబాడ్’. థియేటర్లలో కంటే ఓటీటీలోకి వచ్చాక ఈ సినిమాకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. రీసెంట్‌గా రీ-రిలీజ్ అయినప్పుడు కూడా ఈ మూవీ ఏకంగా 40 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించి అందరినీ షాక్‌కు గురిచేసింది.
ఇంతటి భారీ క్రేజ్ ఉన్న ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ రెడీ అవుతున్న సంగతి తెలిసిందే! ‘తుంబాడ్ 2’ పేరుతో ఆదేశ్ ప్రసాద్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సోహమ్ షా లీడ్ రోల్ పోషిస్తుండగా.. వెర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమాలో బాలీవుడ్ టాప్ యాక్ట్రెస్ అలియా భట్ నటించబోతోందంటూ విపరీతమైన ప్రచారం జరిగింది.
ఇప్పుడు ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ చిత్ర యూనిట్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చేసింది! ‘‘ఒక సరికొత్త అధ్యాయం మొదలైంది.. ‘తుంబాడ్ 2’ లోకి అలియా భట్‌కు గ్రాండ్ వెల్‌కమ్’’ అంటూ హీరో, నిర్మాత సోహమ్ షా ఆమెతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీనిపై అలియా భట్ కూడా స్పందిస్తూ.. 'తుంబాడ్' లాంటి ఒక విలక్షణమైన, అద్భుతమైన ప్రపంచంలో అడుగుపెట్టడం తనకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది. పెన్ స్టూడియోస్‌తో కలిసి సోహమ్ షా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం.. వచ్చే ఏడాది డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది.

