మగబిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్

Bollywood star couple Katrina Kaif Vicky Kaushal: బాలీవుడ్ స్టార్ జంట కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ తల్లిదండ్రులయ్యారు. కత్రినా కైఫ్ నవంబర్ 7న పండంటి మగబిడ్డ జన్మించింది. ఈ శుభవార్తను కత్రినా. విక్కీ కౌశల్ ఇద్దరూ కలిసి సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. వారు తమ పోస్ట్‌లో, "మా ఆనందాల మూట వచ్చేసింది. అపారమైన ప్రేమ, కృతజ్ఞతతో మా మగబిడ్డను ఈ ప్రపంచంలోకి స్వాగతిస్తున్నాము" అని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని సమాచారం. సినీ ప్రముఖులు, అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

2021డిసెంబర్ 9న రాజస్థాన్లో సాంప్రదాయ హిందూ వేడుకలో విక్కీ-కత్రినాల వివాహం జరిగింది. ఈ క్రమంలో పెళ్లయిన నాలుగేళ్లకు కత్రినా తన మొదటిబిడ్డకు జన్మనిచ్చింది. అయితే, గత కొన్ని నెలలుగా కత్రినా కైఫ్ తల్లి కాబోతోంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం విక్కీ కౌశల్.. రణబీర్ కపూర్, ఆలియా భట్ లతో కలిసి ' లవ్ & వార్ ' చిత్రంలో నటిస్తున్నారు. కత్రినా చివరిగా విజయ్ సేతుపతితో కలిసి' మెర్రీ కిస్మస్' లో కనిపించింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story