Boney Kapoor Clarifies: జాన్వీ కపూర్ పెళ్లి వార్తలపై బోనీ కపూర్ క్లారిటీ.. ఆ వార్తలన్నీ పుకార్లే.
ఆ వార్తలన్నీ పుకార్లే.

Boney Kapoor Clarifies: బాలీవుడ్ నటి జాన్వీ కపూర్, ఆమె స్నేహితుడు శిఖర్ పహారియా త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా తిరుమల శ్రీవారి సన్నిధిలో లేదా గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో వీరి వివాహం జరగనుందని వార్తలు వచ్చాయి. అయితే ఈ పుకార్లపై జాన్వీ తండ్రి, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ తాజాగా స్పందించారు.
వప్రస్తుతానికి పెళ్లి లేదు
జాన్వీ కపూర్ వివాహంపై వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని బోనీ కపూర్ స్పష్టం చేశారు. "జాన్వీ ప్రస్తుతం పెళ్లి చేసుకునే ఉద్దేశంలో లేదు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ కేవలం పుకార్లే" అని ఆయన తేల్చి చెప్పారు. ప్రస్తుతం జాన్వీ తన పూర్తి దృష్టిని సినిమాలపైనే కేంద్రీకరించినట్లు ఆయన వెల్లడించారు. శిఖర్ పహారియాతో ఉన్న బంధం గురించి జాన్వీ గతంలో మాట్లాడుతూ.. అతని ఉనికి తనకు ఎంతో ధైర్యాన్ని, భద్రతను ఇస్తుందని ఎమోషనల్ అయిన విషయం తెలిసిందే.
టాలీవుడ్‌లో వరుస ప్రాజెక్టులు
వ్యక్తిగత విషయాలను పక్కన పెడితే, జాన్వీ కపూర్ తన కెరీర్‌లో అత్యంత కీలక దశలో ఉన్నారు. ముఖ్యంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆమెకు భారీ ఆఫర్లు లభిస్తున్నాయి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన జాన్వీ నటిస్తున్న భారీ చిత్రం పెద్ది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ చిత్రం 2026 జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు చిత్రబృందం తాజాగా ధృవీకరించింది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం జాన్వీ కెరీర్‌కు టాలీవుడ్‌లో పెద్ద బూస్ట్‌నిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

