Boyapati Srinu: బాలీవుడ్ కు డైరెక్టర్ బోయపాటి..
డైరెక్టర్ బోయపాటి..

Boyapati Srinu: టాలీవుడ్ లో మాస్ యాక్షన్ సినిమాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన దర్శకుడిగా బోయపాటి శ్రీనుకి భారీ క్రేజ్ ఉంది. హీరోలను లార్జర్ దన్ లైఫ్ గా చూపించడం, పవర్ ఫుల్ డైలాగులు, భారీ యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్ష కులను కట్టిపడేయడం ఆయన స్టైల్. ఆయన కెరీర్ లో ముఖ్యంగా బాలకృష్ణతో చేసిన సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. సింహా, లెజెండ్, అఖండ వంటి చిత్రాలు బాక్సా ఫీస్ వద్ద సంచలన విజయాలు సాధించాయి.
ఇటీవల అఖండ 2తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బోయపాటి ప్రస్తుతం తదుపరి ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఆయన తర్వాతి సినిమా ఎవరితో ఉండబోతుందనే విషయంలో కొంతకాలంగా సస్పెన్స్ కొనసాగుతోంది. తమిళ హీరోతో, అదే విధంగా బాలీవుడ్ హీరోతో సినిమా చేయబోతున్నారని, అల్లు అర్జున్ తో సరైనోడు 2 కూడా తీస్తారని వార్తలొచ్చాయి. తాజాగా మరో ఆసక్తికరమైన టాక్ సినీ వర్గాల్లో వినిపిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ నటించిన జాట్ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించే బాధ్యతలను తీసుకోబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన చర్చలు తుది దశలో ఉన్నాయని, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

