Brahmaji: టాలెంటెడ్ యాక్టర్ బ్రహ్మాజీ లీడ్ రోల్‌లో.. ఒక విభిన్నమైన, ముందెన్నడూ చూడని కథతో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘హ్యాంగ్‌మెన్’. విహాన్ దర్శకత్వంలో వి. శ్రీకాంత్, అజయ్ మైసూర్, వి. హెచ్. రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ సినిమా నేరుగా ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది.

సన్‌నెక్స్ట్ ఓటీటీలో జులై 3 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానున్న నేపథ్యంలో.. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకకు హాస్యనటుడు బ్రహ్మానందం, స్టార్ డైరెక్టర్ నందినీ రెడ్డి, అద్దంకి దయాకర్ ముఖ్య అతిథులుగా హాజరై.. ఈ విభిన్నమైన చిత్రం పెద్ద విజయం సాధించాలని చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.ఈ సందర్భంగా హీరో బ్రహ్మాజీ మాట్లాడుతూ.. ‘ఇలాంటి ఒక అద్భుతమైన కథకు నన్ను హీరోగా అనుకున్నందుకు దర్శకుడు విహాన్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటానని, ఈ సినిమా ప్రతి ఒక్కరి హృదయాలకూ కనెక్ట్ అవుతుందని’ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇక దర్శకుడు విహాన్ మాట్లాడుతూ.. ‘మనం రోజువారీ చేసే ఉద్యోగాల్లాగా ఈ హ్యాంగ్‌మెన్ (ఉరితీసే వ్యక్తి) జాబ్ ఉండదని, సమాజంలో కొత్త సబ్జెక్ట్, కంటెంట్ వచ్చినప్పుడల్లా ఆడియన్స్ ఎప్పుడూ ఆదరిస్తూనే ఉన్నారని, అందుకే ఈ అరుదైన కథను రాసుకున్నట్లు’ తెలిపారు.ఈ కార్యక్రమంలో నటుడు సన్నీతో పాటు రియల్ హ్యాంగ్‌మెన్ పవన్, మ్యూజిక్ డైరెక్టర్ కమ్రాన్, ఎడిటర్ కార్తిక్ పాల్గొని సందడి చేశారు. మరి కమ్రాన్ సంగీతం అందించిన ఈ విలక్షణ చిత్రం.. ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో తెలియాలంటే జులై 3న సన్‌నెక్స్ట్‌లో రిలీజ్ అయ్యే వరకు చూడాల్సిందే!

Updated On
PolitEnt Media

PolitEnt Media

Next Story