బ్రహ్మానందం క్లారిటీ

Brahmanandam : మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో ప్రముఖ సినీ హాస్యనటుడు బ్రహ్మానందం తీసుకున్న ఫోటోకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తలెత్తిన వివాదంపై బ్రహ్మానందం స్పందించారు. ఇది కేవలం సరదా సన్నివేశం మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన మోహన్‌బాబు 50 ఏళ్ల సినీ వేడుకల సందర్భంగా ఈ ఘటన జరిగింది. ఈ వేదికపై ఎర్రబెల్లి దయాకర్ రావు, బ్రహ్మానందంను ఫోటో అడగగా, బ్రహ్మానందం సరదాగా ఇప్పుడు కాదు అంటూ నిరాకరించారు. ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయింది. 'ఎర్రబెల్లిని బ్రహ్మానందం పట్టించుకోలేదు' అంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. ట్రోలింగ్ తీవ్రం కావడంతో బ్రహ్మానందం ఈ వివాదంపై స్పందించారు. "నాకు ఎర్రబెల్లి దయాకర్ రావుతో 30 ఏళ్లుగా సన్నిహిత పరిచయం ఉంది. మేం ఇద్దరం చాలా మంచి స్నేహితులం. ఇద్దరి మధ్య చాలా ఆప్యాయత ఉంది," అని ఆయన తెలిపారు. వేదికపై జరిగిన సన్నివేశం కేవలం సరదాగా జరిగిన సంభాషణ మాత్రమే. దానిని తప్పుగా అర్థం చేసుకుని ట్రోల్ చేయొద్దు అని కోరుతూ వివాదానికి ముగింపు పలికారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story