డ్రాగన్ షూటింగ్‌కు బ్రేక్..

Break for NTR’s Dragon Shooting: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా డ్రాగన్. ఈ సినిమా అప్డేట్స్ కోసం నందమూరి అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా షూటింగ్‌కు తాజాగా ఒక చిన్న బ్రేక్ పడింది. గత కొద్ది రోజులుగా హైదరాబాద్‌లో జరుగుతున్న నైట్ షెడ్యూల్ షూటింగ్‌లో ఎన్టీఆర్ పాల్గొంటున్నారు. అయితే వరుసగా పని చేయడం వల్ల ఆయన స్వల్ప జలుబు, నీరసానికి గురైనట్లు సమాచారం. ఇది పెద్ద ఆరోగ్య సమస్య కాకపోయినప్పటికీ, తారక్ పూర్తి స్థాయిలో కోలుకోవాలనే ఉద్దేశంతో చిత్ర యూనిట్ షూటింగ్‌కు ఒకటి నుంచి రెండు రోజులు తాత్కాలికంగా విరామం ప్రకటించింది. ఎన్టీఆర్ విశ్రాంతి తీసుకున్న వెంటనే తిరిగి సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నారు.

భారీ తారాగణంతో డ్రాగన్ సందడి

మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో భారీ స్టార్ కాస్ట్ నటిస్తోంది. కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా చేస్తుండగా.. మలయాళ స్టార్స్ టోవినో థామస్, సీనియర్ నటుడు బిజూ మీనన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సీనియర్ నటుడు అనిల్ కపూర్ ఈ చిత్రంలో ఒక పవర్‌ఫుల్ పాత్రను పోషిస్తున్నారు.

రిలీజ్ అప్‌డేట్: 2027లోనే గర్జన

ప్రశాంత్ నీల్ మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదలపై మేకర్స్ ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. షూటింగ్ షెడ్యూల్స్ మారడం వల్ల, మొదట అనుకున్న 2026 జనవరి విడుదల తేదీని మార్చి 2027కి వాయిదా వేశారు. నాణ్యత విషయంలో ఎక్కడా తగ్గకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story