Rashmika Movie: రష్మిక మూవీకి బంపర్ ఆఫర్... లక్కంటే ఇది!
లక్కంటే ఇది!

Rashmika Movie: నేషనల్ క్రష్ రష్మిక మందన్న రీసెంట్ గా కుబేర మూవీతో మరో సూపర్ హిట్ అందుకు న్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో ఆమె రోల్ చాలా ఎక్కువ రన్ టైంతో ఉన్నా కూడా ఇంపాక్ట్ సినిమా అంతా ఉంది. కుబేర హిట్ అవ్వడంతో ఆమె చేస్తున్న నెక్స్ట్ సినిమాల మీద ఆ ఎఫెక్ట్ ఉంది. రష్మిక ప్రస్తుతం ది గర్ల్ ఫ్రెండ్ సినిమా చేస్తుంది. అందులో దీక్షిత్ శెట్టి మేల్ లీడ్ గా నటిస్తున్నాడు. వరుస సినిమాలు హిట్లు కొడుతుండటం వల్ల రష్మిక చేస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమాకు సూపర్ డిమాండ్ ఏర్పడింది. ఈ మూవీని పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఐతే రష్మిక ఉన్న ఫాం చూసిన హిందీ మేకర్స్ ఆమె నటిస్తున్నది గర్ల్ ఫ్రెండ్ సినిమాను భారీ మొత్తానికి కొనేశారట. మిగతా భాషల్లో కూడా ఆ సినిమాకు మంచి బిజినెస్ జరు గుతుందని సమాచారం. ఆమె మూవీలో ఉందంటే నేషనల్ వైడ్ గా డిస్ట్రిబ్యూటర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఆ ఇంపాక్ట్ ది గర్ల్ ఫ్రెండ్ సినిమా బిజినెస్ అనుకున్న దానికన్నా బాగా జరిగిందని తెలుస్తుంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. విభిన్నమైన ప్రేమ కథతో లేడీ ఓరియంటెడ్ సినిమాగా రానుందిఈ సినిమా కూడా హిట్ పడితే రష్మిక రేంజ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంటుంది. దీంతోపాటు బాలీవుడ్ స్టార్ హీరో ఆయుష్మాన్ ఖురానాకు జంటగా 'థామా'లో నటిస్తోంది.
