కేసు నమోదు

Mangli and Venu Udugula: ప్రముఖ సింగర్ మంగ్లీ ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. ఇన్వెస్ట్‌మెంట్ల పేరుతో సామాన్యులను మోసం చేయడమే కాకుండా.. బాధితుల తరపున పోరాడుతున్న న్యాయవాదిని బెదిరించారనే ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

అసలేం జరిగిందంటే.. మంగ్లీ, ఆమె సోదరుడు శివ మరికొంత మందితో కలిసి సుమారు 100 మంది నుంచి భారీగా నిధులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. వ్యాపారంలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు ఇస్తామని నమ్మించి ఈ డబ్బు తీసుకున్నట్లు సమాచారం. అయితే కాలం గడుస్తున్నా లాభాలు ఇవ్వకపోగా.. అసలు డబ్బు కూడా తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు.తమకు న్యాయం చేయాలని కోరుతూ బాధితులు న్యాయవాది సుబ్బారావును ఆశ్రయించారు. అయితే ఈ వ్యవహారంపై న్యాయవాది నిలదీయడంతో.. మంగ్లీ బృందం నుంచి ఆయనకు బెదిరింపులు మొదలయ్యాయి.

సింగర్ మంగ్లీ, ఆమె సోదరుడు శివతో పాటు దర్శకుడు వేణు ఊడుగుల కూడా తనకు ఫోన్ చేసి తీవ్రంగా బెదిరించారని న్యాయవాది సుబ్బారావు ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను యాక్సిడెంట్ చేయించి చంపేస్తామని హెచ్చరించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.న్యాయవాది ఫిర్యాదును స్వీకరించిన పంజాగుట్ట పోలీసులు.. మంగ్లీ, శివ, వేణు ఊడుగుల,ఇతరులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తనకు ప్రాణహాని ఉందని న్యాయవాది రక్షణ కోరడంతో పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story