Case Filed Against Prakash Raj: ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి వివాదాల సుడిగుండంలో చిక్కుకున్నారు. తన విలక్షణ నటనతోనే కాకుండా.. రాజకీయ, సామాజిక అంశాలపై నిలదీసే స్వభావం ఉన్న ఆయన.. ఈసారి పవిత్ర రామాయణంపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెను దుమారం రేపుతున్నాయి.

అసలేం జరిగిందంటే.. ఇటీవల కేరళలోని కోజికోడ్‌లో జరిగిన లిటరేచర్ ఫెస్టివల్‌లో ప్రకాష్ రాజ్ ప్రసంగిస్తూ.. రామాయణాన్ని వింతగా విశ్లేషించారు. ఒక చిన్నారుల నాటకాన్ని ఉదాహరణగా చూపిస్తూ.. శ్రీరాముడు, లక్ష్మణుడు ఉత్తరాది నుంచి వచ్చిన వలస కూలీలని, వారు దక్షిణాదికి వచ్చి రావణుడి తోటలో పండ్లు దొంగిలించారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా దీనికి జీఎస్టీ (GST)ని ముడిపెడుతూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని ఆరోపిస్తూ.. నటి, బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి రంగంలోకి దిగారు. హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఆయనపై రాతపూర్వక ఫిర్యాదు చేశారు. పవిత్ర ఇతిహాసాన్ని వక్రీకరించి, మతపరమైన సామరస్యాన్ని దెబ్బతీసేలా ప్రకాష్ రాజ్ ప్రసంగం ఉందని ఆమె మండిపడ్డారు

భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్లతో పాటు ఐటీ చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కరాటే కళ్యాణి డిమాండ్ చేశారు. కోట్ల మంది భారతీయుల విశ్వాసమైన రామాయణాన్ని కించపరచడం దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను పోలీసులకు సమర్పించారు. మరి ఈ ఫిర్యాదుపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

PolitEnt Media

PolitEnt Media

Next Story