అరెస్ట్ చేస్తారా?

CBI Notices to Vijay: తమిళ సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత విజయ్ (దళపతి విజయ్) కు కేంద్రీయ దర్యాప్తు సంస్థ CBI నోటీసులు జారీ చేసింది. గతేడాది తమిళనాడులోని కరూర్‌లో జరిగిన విషాదకరమైన తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఈ సమన్లు అందాయి.ఈ నెలరి 12 న ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

తొలుత రాష్ట్ర పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేయగా, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు సీబీఐకి బదిలీ అయింది. ఇప్పటికే పార్టీ కీలక నేతలను ప్రశ్నించిన అధికారులు, ఇప్పుడు నేరుగా విజయ్‌ను విచారించనున్నారు.సభ నిర్వహణలో వైఫల్యాలు, అనుమతుల ఉల్లంఘన మరియు భద్రతా పరమైన లోపాలపై విజయ్‌ను ప్రశ్నించే అవకాశం ఉంది.ఈ ఘటనపై స్పందించిన టీవీకే నేతలు, ప్రభుత్వం, పోలీసుల వైఫల్యం వల్లే ఈ తొక్కిసలాట జరిగిందని ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి కొన్ని వీడియో ఆధారాలను కూడా ఇప్పటికే సీబీఐకి సమర్పించారు.

సెప్టెంబర్ 27, 2025 లో కరూర్ తొక్కిసలాట ఘటన జరిగిన సంగతి తెలిసిందే. అసలేం జరిగిందంటే.? కరూర్ జిల్లాలో విజయ్ నిర్వహించిన భారీ బహిరంగ సభ/ప్రచార ర్యాలీలో ఊహించని విధంగా జనం పోటెత్తారు. సుమారు 10 వేల మంది పట్టే చోట 30 వేల మందికి పైగా రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 41 మంది మరణించగా, 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

విజయ్ నటించిన కొత్త చిత్రం జననాయగన్' కు సంబంధించి సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికేట్ రాకపోవడంతో, చిత్ర బృందం మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. ఈ సినిమా జనవరి 9, 2026న విడుదల కావాల్సి ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story