Celebrity Talk Show 'Jayammu Nischayammu Ra': రాత్రికిరాత్రే మా ఆస్తులన్నీ కోల్పోయాం..జీరో నుంచి మొదలు పెట్టాం
జీరో నుంచి మొదలు పెట్టాం

Celebrity Talk Show 'Jayammu Nischayammu Ra': నటుడు జగపతి బాబు హోస్ట్ చేస్తున్న సెలబ్రిటీ టాక్ షో 'జయమ్ము నిశ్చయమ్మురా' లో హీరో రామ్ పోతినేని పాల్గొని తన జీవితంలోని కొన్ని ముఖ్యమైన విషయాలను , వ్యక్తిగత అంశాలను పంచుకున్నారు.రామ్ పోతినేని తన బాల్యం, కుటుంబం గురించి చెబుతూ, వారి జీవితంలో జరిగిన ఒక కీలకమైన సంఘటన గురించి ప్రస్తావించారు
"నేను పుట్టిన సమయంలో విజయవాడలో కులాల పేరుతో గొడవలు పెరిగాయి. ఆ అల్లర్ల కారణంగా మా కుటుంబం ఒక్క రాత్రిలో ఆస్తులన్నీ కోల్పోయింది. దాంతో మేము జీరోకు వచ్చేశాం. విజయవాడలో ఉండడం కరెక్ట్ కాదని నిర్ణయించుకుని కుటుంబమంతా చెన్నైకి వెళ్లిపోయాం. అక్కడ మళ్లీ జీరో నుంచి జీవితాన్ని మొదలుపెట్టాల్సి వచ్చింది. తన తండ్రి ఆ ఒడుదొడుకులను ఎదుర్కొని కుటుంబాన్ని నిలబెట్టినందుకు ఆయనంటే తనకు చాలా గౌరవం అని తెలిపారు.
హోస్ట్ జగపతి బాబు రామ్ పోతినేనిని అతని వ్యక్తిగత సంబంధాల (లవ్ లైఫ్) గురించి ప్రశ్నించగా, రామ్ నవ్వుతూ సమాధానమిచ్చారు. నువ్వు అపార్ట్‌మెంట్‌లో సోలోగా ఉంటున్నావ్, ఎఫైర్ అయితే గ్యారెంటీగా ఉండే ఉంటుంది. కొద్దికొద్దిగా వినిపిస్తున్నాయి.
"లవ్ అనండి ఓకే... మరీ ఎఫైర్ ఏంటి?" అంటూ రామ్ నవ్వుతూ సమాధానం చెప్పారు. తాను ఒక్క అమ్మాయిని పడేయడానికి చాలా కష్టపడ్డానని, అయితే ఆ తర్వాత చాలామంది అమ్మాయిలను తన వెంట తిప్పుకున్నానని సరదాగా చెప్పారు.
