హీరో శ్రీకాంత్ కు ఈడీ సమన్లు

Chennai Drugs Case: డ్రగ్స్ కొనుగోలు కేసులో తమిళ నటులు టి. శ్రీకాంత్ (తెలుగులో శ్రీరామ్ గా సుపరిచితుడు) , కృష్ణ కుమార్‌లకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు జారీ చేసింది. చెన్నైలో నమోదైన కొకైన్ అక్రమ రవాణా, వినియోగానికి సంబంధించిన కేసు. ఈ కేసులో నటులు శ్రీకాంత్, కృష్ణ గతంలో అరెస్ట్ అయ్యి, ఆ తరువాత బెయిల్‌పై విడుదలయ్యారు. డ్రగ్స్ కొనుగోలుకు సంబంధించిన డబ్బు లావాదేవీల (Money Laundering) కోణంలో ED దర్యాప్తు చేస్తోంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) కింద ఈ విచారణ జరుగుతోంది.

ED అధికారులు శ్రీకాంత్, కృష్ణ కుమార్‌లను వరుసగా అక్టోబర్ 27 , 28 తేదీల్లో విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేశారు.ఈ కేసులో మాజీ AIADMK నేత టి. ప్రసాద్ కూడా అరెస్ట్ అయ్యారు. ఈ డ్రగ్స్ సరఫరా నెట్‌వర్క్ ఆర్థిక మూలాలను కనుగొనే ప్రయత్నంలో ED ఉంది.

డ్రగ్స్ కేసు వివరాలు

2025 జూన్‌లో (జూన్ 23) చెన్నై పోలీసులు డ్రగ్స్ కొనుగోలు, వినియోగం ఆరోపణల కింద శ్రీకాంత్‌ను అరెస్ట్ చేశారు. ఒక బార్‌లో జరిగిన గొడవకు సంబంధించి అన్నాడీఎంకే మాజీ నేత టి. ప్రసాద్‌ను అరెస్ట్ చేయగా, అతని విచారణలో శ్రీకాంత్ పేరు బయటపడింది. ప్రసాద్ నుంచి శ్రీకాంత్ దాదాపు 40 సార్లు కొకైన్ కొనుగోలు చేశారని, దానికి రూ. 4.72 లక్షలు ఆన్‌లైన్‌లో చెల్లించారని పోలీసులు వెల్లడించారు. శ్రీకాంత్‌కు నిర్వహించిన రక్త పరీక్షల్లో డ్రగ్స్ వాడినట్లు నిర్ధారణ అయింది.

విచారణ సందర్భంగా శ్రీకాంత్ 'డ్రగ్స్ వాడి తప్పు చేశాను' అని కోర్టులో అంగీకరించి, తన కుమారుడి కోసం బెయిల్ ఇవ్వాలని అభ్యర్థించారు. కోర్టు ఆయనకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది, ఆ తరువాత షరతులతో కూడిన బెయిల్‌పై విడుదలయ్యారు.

ప్రస్తుతం, ఈ డ్రగ్స్ కొనుగోలు వ్యవహారంలో జరిగిన డబ్బు లావాదేవీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగా ED శ్రీకాంత్, కృష్ణ కుమార్‌ లు విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story