‘Chennai Love Story’: సెన్సార్ పూర్తయిన ‘చెన్నై లవ్ స్టోరీ’: U/A సర్టిఫికేట్!
U/A సర్టిఫికేట్!

‘Chennai Love Story’: యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న సరికొత్త రొమాంటిక్ డ్రామా ‘చెన్నై లవ్ స్టోరీ’ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్‌ను జారీ చేసింది.
కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహించగా, సాయి రాజేష్ కథను అందించారు. అమృత ప్రొడక్షన్స్ మరియు మాస్ మూవీ మేకర్స్ బ్యానర్లపై ఎస్‌కేఎన్ మరియు సాయి రాజేష్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.
ఈ సినిమాలోని భావోద్వేగమైన కథనంతో పాటు యూత్‌తో పాటు కుటుంబ సమేతంగా చూడదగ్గ క్లీన్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఉందని సెన్సార్ బోర్డు సభ్యులు చిత్ర యూనిట్‌ను ప్రత్యేకంగా అభినందించినట్లు సమాచారం. ఇటీవల కాలంలో వచ్చిన రొమాంటిక్ సినిమాలకు భిన్నంగా, ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా బాగా కనెక్ట్ అయ్యేలా ఈ సినిమా ఉందనే ప్రశంసలు దక్కడంతో సినిమాపై టాలీవుడ్‌లో మంచి బజ్ ఏర్పడింది.
సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణవ్యాప్తంగా వరుస ప్రమోషన్స్, ఈవెంట్లతో సందడి చేస్తున్నారు. కాగా, ఈ చిత్రానికి స్వర బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించడం విశేషం.

