Film ‘Obsession’: ఎ సర్టిఫికేట్ సినిమాకు చిన్న పిల్లలా? ..అబ్సెషన్ మూవీపై వివాదం
అబ్సెషన్ మూవీపై వివాదం

Film ‘Obsession’: కేవలం తొమ్మిది కోట్ల రూపాయల చిన్న బడ్జెట్.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఏకంగా 950 కోట్ల రూపాయల కలెక్షన్ల సునామీ! హాలీవుడ్ లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ ‘అబ్సెషన్’ (Obsession) ప్రస్తుతం థియేటర్లలో దుమ్మురేపుతోంది. అయితే.. వసూళ్ల పరంగా దూసుకుపోతున్న ఈ క్రేజీ మూవీపై, బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ గుప్తా చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
ఈ చిత్రంలో ఉన్న తీవ్రమైన హింస, అడల్ట్ కంటెంట్ కారణంగా సెన్సార్ బోర్డ్ (CBFC) దీనికి ‘ఎ’ (Adults Only) సర్టిఫికేట్ ఇచ్చింది. అంటే రూల్ ప్రకారం.. 18 ఏళ్ల లోపు వారు ఈ సినిమా చూడటానికి వీల్లేదు. కానీ, థియేటర్లలో సీన్ మొత్తం రివర్స్‌లో ఉందంటూ సంజయ్ గుప్తా సోషల్ మీడియా వేదికగా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
మే 29న ఒక మల్టీప్లెక్స్‌లో తనకు ఎదురైన అనుభవాన్ని షేర్ చేస్తూ.. "నేను ఒక కొత్త మలయాళ సినిమా చూడటానికి వెళ్లాను, ఆ స్క్రీన్‌లో కేవలం నేను ఒక్కడినే ఉన్నాను. కానీ, పక్క స్క్రీన్‌లో మా అబ్బాయి ‘అబ్సెషన్’ సినిమా చూస్తున్నాడు. షాకింగ్ ఏంటంటే.. ఆ థియేటర్ మొత్తం చిన్న పిల్లలతో, మైనర్లతో నిండిపోయింది. అంటూ సంజయ్ గుప్తా రాసుకొచ్చారు.
ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవ్వడంతో ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది. 'ఎ' రేటింగ్ సినిమా అయినప్పటికీ, థియేటర్ యాజమాన్యాలు కనీసం ఏజ్ ప్రూఫ్ కూడా చెక్ చేయకుండా మైనర్లను లోపలికి ఎలా రానిస్తున్నారంటూ నెటిజన్లు, పేరెంట్స్ మండిపడుతున్నారు.
నిజానికి ఇండియాలో ఈ సినిమాను రిలీజ్ చేసేముందు సెన్సార్ బోర్డ్.. దాదాపు 38 సెకన్ల పాటు సాగే అత్యంత దారుణమైన హింస, శృంగార సీన్లపై కత్తెర వేసింది. అయినప్పటికీ థియేటర్లలో జనం ఎగబడుతున్నారు. ఇండియాలో మొదటి రోజే 1.75 కోట్ల నెట్ వసూళ్లతో అదరగొట్టిన ఈ చిత్రం.. వరల్డ్ వైడ్‌గా రూ. 950 కోట్ల రేంజ్‌లో దూసుకుపోతోంది.

