పెళ్లయినా సరే అది రేప్ కిందకే వస్తది!

Singer Chinmayi Sripada: సమాజంలో మహిళల హక్కులు, భద్రతపై ఎప్పుడూ గళమెత్తే ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద తాజాగా మరో వివాదాస్పద అంశంపై ఘాటుగా స్పందించారు. 'చిరైయా’ వెబ్ సిరీస్‌లో భార్యకు ఇష్టం లేకుండా భర్త బలవంతంగా శృంగారం చేసే సీన్‌పై ఆమె సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు.

పెళ్లయినంత మాత్రాన భాగస్వామికి ఇష్టం లేకపోయినా, ముహూర్తం పేరుతో శృంగారానికి బలవంతం చేయడం ముమ్మాటికీ తప్పని ఆమె తేల్చి చెప్పారు. ఇది 'రేప్' కిందకే వస్తుందని X (ట్విట్టర్) వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ముఖ్యంగా పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లలో, భర్త మనస్తత్వం గురించి తెలుసుకునే లోపే ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

కేవలం శారీరక సంబంధం మాత్రమే కాదు.. దంపతుల మధ్య పరస్పర గౌరవం, ఇష్టం ఉన్నప్పుడే ఆ బంధం కలకాలం నిలుస్తుందని చిన్మయి తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. వైవాహిక జీవితంలో శారీరక కలయిక అనేది ఇద్దరి అంగీకారంతో జరగాలని, బలవంతం అనేది బంధాన్ని విచ్ఛిన్నం చేస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story