Chiranjeevi and Balakrishn: సంక్రాంతి రేసు నుండి తప్పుకున్న చిరంజీవి, బాలకృష్ణ!
చిరంజీవి, బాలకృష్ణ!

Chiranjeevi and Balakrishn: విశ్వంభర', 'NBK111' రిలీజ్ ప్లాన్స్ ఇవే!టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణల మధ్య సంక్రాంతి 2027 బరిలో భారీ పోటీ ఉండబోతోందంటూ గత కొన్ని రోజులుగా ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే నమ్మదగిన ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఒకరికొకరు పోటీగా పండగ సీజన్‌లో తలపడే ఆలోచనలో లేరని, ఈ బాక్సాఫీస్ క్లాష్ దాదాపు తప్పినట్లేనని తెలుస్తోంది.మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ సోషియో ఫాంటసీ డ్రామా ‘విశ్వంభర’ ఎట్టకేలకు దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం. పలు వాయిదాల తర్వాత ఈ చిత్రాన్ని అక్టోబర్ 16న గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ ముహూర్తం ఖరారు చేసినట్లు ఇండస్ట్రీ టాక్. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ, ప్రొడక్షన్ హౌస్ మాత్రం ఇదే ఫైనల్ రిలీజ్ డేట్ అని గట్టిగా భావిస్తోంది.ఒకవేళ 'విశ్వంభర' కనుక దసరా రేసులో నిలిస్తే, దర్శకుడు బాబీతో చిరంజీవి చేయబోయే తదుపరి చిత్రం సంక్రాంతి 2027కి రావడం కష్టమేనని విశ్లేషకులు చెబుతున్నారు. కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే మెగాస్టార్ నుంచి రెండు సినిమాలు విడుదల చేయడం సరైన వ్యూహం కాదు కాబట్టి, బాబీ ప్రాజెక్ట్ మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉంది.మరోవైపు, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'NBK111' షూటింగ్ శరవేగంగా దూసుకుపోతోంది. ఈ చిత్రాన్ని ముందుగా డిసెంబర్ 4న రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ, అదే సమయానికి రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పీరియాడిక్ వార్ డ్రామా ‘ఫౌజీ’ థియేటర్లలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2026 చివరి నాటికి ‘ఫౌజీ’ చిత్రాన్ని విడుదల చేయాలని నెట్‌ఫ్లిక్స్ ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో, ఆ సినిమా మేకర్స్ డిసెంబర్ 4వ తేదీని టార్గెట్ చేసినట్లు వినికిడి. ప్రభాస్ సినిమా కనుక డిసెంబర్ బరిలో నిలిస్తే, బాలకృష్ణ ‘NBK111’ డిసెంబర్ స్లాట్ నుండి తప్పుకుని, నేరుగా సంక్రాంతి 2027 పండగ సీజన్‌ను టార్గెట్ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. రాబోయే కొన్ని వారాల్లో రాబోయే సినిమాల రిలీజ్ క్యాలెండర్‌పై మరింత స్పష్టత రానుంది.

