Chiranjeevi – Bobby Kolli Combo Returns: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ తర్వాత చిరంజీవి - దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో మరో క్రేజీ ప్రాజెక్ట్ సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. మెగా 158గా పిలుస్తున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది.

పవర్‌ఫుల్ లుక్ టెస్ట్

ఈ సినిమాకు సంబంధించిన ప్రాథమిక లుక్ టెస్ట్‌ను చిత్రబృందం విజయవంతంగా పూర్తి చేసింది. ఈ విషయాన్ని దర్శకుడు బాబీ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. చిరంజీవి ఫోటోషూట్‌కు సంబంధించిన పిక్ పంచుకుంటూ.. "హింసకు ముందు నిశ్శబ్దం" అనే క్యాప్షన్ ఇచ్చారు. దీన్ని బట్టి ఈ సినిమా భారీ స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఉండబోతుందని స్పష్టమవుతోంది. లుక్ టెస్ట్ పూర్తవడంతో, అతి త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

ఈ ఏడాది ఇప్పటికే మన శంకర వరప్రసాద్ గారుతో పలకరించిన మెగాస్టార్, మరిన్ని ప్రయోగాత్మక చిత్రాలతో సిద్ధంగా ఉన్నారు. వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విశ్వంభర సోషియో ఫాంటసీ థ్రిల్లర్ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరో సినిమా లైనప్‌లో ఉంది. మొత్తానికి తన మార్కు మాస్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా వైవిధ్యమైన కథలతో మెగాస్టార్ అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు.

Next Story