సర్ ఫ్రైజ్ ఇచ్చిన చిరు

Chiranjeevi: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎం అయ్యాక చాలా బిజీగా ఉన్నాడు. తాను ఒప్పుకున్న సినిమాలను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. అందుకే గ్యాప్ దొరికనప్పుడు సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటున్నాడు. పవన్ హరిహర వీరమల్లు రిలీజ్ కురెడీగా ఉండగా..ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ ప్రారంభ దశలోనే ఉంది.

లేటెస్ట్ గా ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ లో మెగాస్టార్ చిరంజీవి సందడి చేసి సర్ ప్రైజ్ ఇచ్చారు. ఈ ఇద్దరు మెగా బ్రదర్స్ నటిస్తున్న సినిమాల షూటింగ్స్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతున్నాయి. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఓ సినిమా తెరకెక్కుతుండగా, పక్క సెట్ లోనే హరీష్ శంకర్ డైరెక్షన్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా పవన్ సెట్ లోకి చిరంజీవి వచ్చి సర్ ప్రైజ్ చేశారు. వీరిద్దరూ కలిసున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇద్దురు ఒకే ఫ్రేమ్ లో చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story