Chiranjeevi: సోషల్ మీడియాలో, అటు రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారిన పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. జనసేనాని ఆరోగ్య పరిస్థితిపై నెలకొన్న సందిగ్ధతకు తెరదించుతూ స్వయంగా మెగాస్టార్ చిరంజీవి ఒక ప్రకటన విడుదల చేశారు. తన తమ్ముడి ఆరోగ్యంపై వస్తున్న వార్తలకు చెక్ పెడుతూ.. అభిమానులందరికీ ఊరటనిచ్చే వార్తను పంచుకున్నారు.

పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. "కళ్యాణ్ బాబుకు సర్జరీ విజయవంతంగా పూర్తయింది" అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. "కళ్యాణ్ బాబు ఇప్పుడు పూర్తి సురక్షితంగా ఉన్నారు.. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు" అంటూ చిరు చేసిన ట్వీట్ మెగా , జనసేన అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్న పవన్.. తిరిగి సాధారణ స్థితికి రావడానికి కనీసం ఒక వారం రోజుల సమయం పడుతుందని చిరంజీవి తన ట్వీట్‌లో వెల్లడించారు.

కేవలం అప్‌డేట్ ఇవ్వడమే కాకుండా.. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన కోట్లాది మంది అభిమానులకు, శ్రేయోభిలాషులకు చిరంజీవి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. "పవన్ కోలుకోవాలని కోరుకుంటూ మీరు చూపించిన ప్రేమ, చేసిన ప్రార్థనలు వెలకట్టలేనివి" అంటూ చిరు ఎమోషనల్ అయ్యారు. ఆపత్కాలంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ మెగా కుటుంబం తరపున కృతజ్ఞతలు తెలియజేశారు.

మొత్తానికి పవన్ కళ్యాణ్ సర్జరీ సక్సెస్ కావడంతో అటు రాజకీయ వర్గాలు, ఇటు సినీ పరిశ్రమ ఊపిరి పీల్చుకున్నాయి. మరో వారం రోజుల్లో పవన్ తిరిగి తన పనుల్లో బిజీ కానున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story