‘Kaaka’: మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న ‘కాకా’ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులు తాజాగా ప్రారంభమయ్యాయి. షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ఒకేసారి పూర్తి చేసేలా చిత్రబృందం ముందుకు వెళ్తోంది.

ఇప్పటికే సినిమా ఫస్ట్ హాఫ్ షూటింగ్ పూర్తయిందని చిరంజీవి తెలిపారు. సెకండ్ హాఫ్‌లో దాదాపు 30 శాతం చిత్రీకరణ కూడా పూర్తయిందని వెల్లడించారు. మరోవైపు ఫస్ట్ హాఫ్‌కు సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పనులను సంగీత దర్శకుడు తమన్ ప్రారంభించినట్లు తెలిపారు.

ఈ సినిమాలో చిరంజీవి ‘కదిరి కాళిదాస్’ పాత్రలో కనిపించనున్నారు. అనస్వర రాజన్, నివేదా పేతురాజ్, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఫ్యామిలీ, యాక్షన్ అంశాలతో దర్శకుడు బాబీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

‘కాకా’ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. షూటింగ్, డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా పూర్తి చేసి సంక్రాంతి విడుదలకు సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది.

Next Story