మెగా 158

Chiranjeevi’s Mega 158: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి. మాస్ డైరెక్టర్ బాబీ కాంబోలో మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్ పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. 'వాల్తేరు వీరయ్య' తర్వాత వీరిద్దరి కలయికలో తెరకెక్కనున్న ఈ మూవీ (మెగా 158)కి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. తాజాగా ఈ చిత్రంపై ఇంటె స్టింగ్ అప్డేట్ వచ్చింది. బాబీ ఇప్పటికే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం కిరాక్ స్క్రిప్ట్ ను లాక్ చేసినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. ఇదొక ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది. ఇందులో చిరు కోసం బాబీ ఒక సాలిడ్ క్యారెక్టరైజేషనన్ను డిజైన్ చేశాడని, మెగాస్టార్ ఎంతో స్టైలిష్ గా కనిపిస్తాడని తెలుస్తోంది.

అంతేకాదు ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, ప్రియమణితో పాటు పలువురు ప్రముఖ నటులను రంగంలోకి దించేందుకు దర్శకుడు ప్లాస్ చేస్తున్నాడట. ముఖ్యంగా ఈ మూవీ కైమాక్స్ హైలైట్గా ఉండబోతోందని సమాచారం. బాబీ మాస్ ఆడియన్స్ కు పూనకాలు తెప్పించే రేంజ్లో భారీ యాక్షన్ సీక్వెనన్ను డిజైన్ చేశాడట. కేవీఎన్ ప్రొడక్షన్స్ అత్యంత భారీ వ్యయంతో నిర్మించనున్న ఈ మూవీ త్వరలోనే పూజా కార్యక్రమాలు జరుపుకోనుంది. మార్చి ఎండింగ్నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story