చిరు వెంకీ సాంగ్

Chiru-Venky Song Filmed: అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చిరంజీవి హీరోగా వస్తున్న మన శంకరవరప్రసాద్ గారు సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో చిరంజీవితో కలిసి విక్టరీ వెంకటేష్ మొదటిసారిగా ఒక మాస్ డ్యాన్స్ నంబర్‌లో కలిసి స్టెప్పులు వేయబోతున్నారని టాక్.ఈ పాట చిత్రీకరణలో 500 మందికి పైగా డ్యాన్సర్లు పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో భారీ సెట్ వేసి మెగాస్టార్- , విక్టరీ వెంకటేశ్‌ కాంబినేషన్‌లో సాంగ్ షూట్ చేస్తున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఈ సెట్‌ను కలర్, రిథమ్, వైబ్ లతో నిండిన కార్నివాల్ వాతావరణంలా తీర్చిదిద్దారంట

భీమ్స్ సిసిరోలియో ఈ పాటకి అదిరిపోయే మాస్ బీట్స్‌ను కంపోజ్ చేశారు. 'మీసాల పిల్లాకి' పాటకి కొరియోగ్రఫీ చేసిన పొలంకి విజయ్ ఈ పాటకు కూడా కొరియోగ్రఫీ అందిస్తున్నారు.

ఇద్దరు స్టార్ హీరోల కెమిస్ట్రీ, ఎనర్జీ, హుషారైన మూవ్స్ థియేటర్లలో ప్రేక్షకులను ఫుల్‌గా ఎంటర్‌టైన్ చేస్తాయని చిత్ర యూనిట్ భావిస్తోంది.వెంకటేష్ ఈ చిత్రంలో కేవలం అతిథి పాత్ర (Cameo) కాకుండా, ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అభిమానులకు ఇది ఒక పెద్ద సర్‌ప్రైజ్ అని చెప్పవచ్చు.

చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇటీవల, హైదరాబాద్‌లో భారీ సెట్‌లో క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించారు.ఈ సినిమాను 2026 సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది.ఈ సినిమా కోసం చిరంజీవి సుమారు రూ.70 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story