Faria Abdullah:చిట్టి బిజీ బిజీ.. ఫోటోలు వైరల్
చిట్టి బిజీ

Faria Abdullah: ‘జాతి రత్నాలు’ మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ ఫరియా అబ్దుల్లా. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈభామ అందం, నటనతో తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత లైక్, షేర్ & సబ్జెబ్, రావ ణాసుర, ఆ ఒక్కటి అడక్కు, కల్కి, మత్తు వదలరా 2 వంటి సినిమాల్లో నూ మెరిసింది. ఇలా వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ కెరీర్లో అడుగులు వేస్తోంది. ఈ మధ్యకాలం లో వెబ్ ప్రాజెక్ట్స్ లోనూ కనిపించిన ఫరియా, ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకుంటోంది. ఇదిలా ఉండగా ఈఅమ్మడు ప్రస్తుతం రెండు ప్రాజెక్ట్స్ నటిస్తోందన్న టాక్ ఉంది. త్వరలోనే ఓ థ్రిల్లర్, ఓ కామెడీ మూవీలో ఆమె నటనను చూడొచ్చని టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరోవైపు ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న తమిళ చిత్రం 'మల్లి మయిల్ ' రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తాజాగా బ్లాక్ అవుట్ ఫిట్ లో తన అందంతో అందరి మనసు దోచేస్తుంది. మ్యాచింగ్ బూట్స్, యూనిక్ హెయిర్ స్టైల్ తో బ్యూటిఫుల్ లుక్లో ఆకట్టుకుంటుంది. ఓ గోడకట్టే స్టోరేజీ సెట్టింగ్ లో బ్లాక్ డ్రెస్సులో మెరిసిన ఫరియా, మేకప్ స్టైల్ నుంచి పోజింగ్ వరకు అన్నీ స్పెషల్ గా కనిపించాయి. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నా యి. కేవలం కొన్ని గంటల్లోనే లక్షల మంది వీక్షించారు.
