Malavika Mohanan: వెండితెరపై మహిళా పాత్రల తీరుతెన్నులపై ప్రముఖ నటి మాళవిక మోహనన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కేవలం నటీమణులు మారితే సరిపోదని, సినీ పరిశ్రమలోని ఇతర విభాగాల్లోనూ మహిళల ప్రాతినిధ్యం పెరగాలని ఆమె అభిప్రాయపడ్డారు. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, హాలీవుడ్ సంచలన చిత్రం 'కిల్ బిల్' తరహాలో పవర్ ఫుల్ యాక్షన్ రోల్స్ చేయాలన్న తన మనసులోని కోరికను తాజాగా బయటపెట్టారు.

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె పలు కీలక విషయాలు పంచుకున్నారు. వాస్తవానికి సినీ పరిశ్రమలో మహిళా దర్శకులు, రచయిత్రులు చాలా తక్కువని, వేళ్ల మీద లెక్కపెట్టవచ్చని తెలిపారు. సినిమాల్లో 'ఫిమేల్ గేజ్' (స్త్రీల కోణం) మరింత పెరగాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు. మహిళా మేకర్స్ సంఖ్య పెరిగినప్పుడే అద్భుతమైన యాక్షన్ పాత్రలు పుట్టుకొస్తాయని, అప్పుడే మన దేశంలోనూ 'కిల్ బిల్' లాంటి యాక్షన్ సినిమాలు వస్తాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story