Producer Naga Vamsi: సినిమా పోస్టర్లపై ప్రచురించే భారీ బాక్సాఫీస్ కలెక్షన్ల లెక్కలు నిజం కావని, వాటి వెనుక ఉన్న అసలు నిజాలు ఆదాయపు పన్ను శాఖ అధికారులకు స్పష్టంగా తెలుసని ప్రముఖ టాలీవుడ్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో బాక్సాఫీస్ ఫేక్ నంబర్ల సంస్కృతిపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ, మీడియా వర్గాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.

ఐటీ అధికారులకు అసలు లెక్కలు తెలుసు

నాగవంశీ మాట్లాడుతూ.. "సినిమా ప్రచార పోస్టర్లపై వేసే రూ. 100 కోట్లు, రూ. 200 కోట్ల కలెక్షన్ల నంబర్లు వాస్తవం కాదనే విషయం ఐటీ అధికారులకు బాగా తెలుసు. ఏ సినిమాకు ఎంత అసలైన వసూళ్లు వచ్చాయో తెలిపే పక్కా డేటా వారి దగ్గర ముందే ఉంటుంది. అందుకే మేము పోస్టర్లపై ప్రకటనల కోసం ఎంత ఎక్కువ మొత్తం వేసి చూపించినా, ఐటీ శాఖ నుండి నిర్మాతలకు ఎలాంటి నోటీసులు గానీ, ఇబ్బందులు గానీ ఎదురుకావు" అని నిర్మొహమాటంగా వెల్లడించారు.

ప్రమోషన్లలో ప్రవర్తనను బట్టి సినిమా ఫలితం

సినిమా ప్రమోషన్ల సమయంలో హీరోలు, నిర్మాతలు మాట్లాడే తీరు, ప్రవర్తనను బట్టే ఆ సినిమా ఫలితం ఏంటో ప్రేక్షకులకు సులభంగా అర్థమైపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

టాలీవుడ్‌లో పోస్టర్లపై అంకెల గారడీకి సంబంధించిన ఫేక్ కలెక్షన్ల వ్యవహారంపై సుదీర్ఘకాలంగా విమర్శలు వస్తున్నప్పటికీ, ఒక అగ్ర నిర్మాత స్వయంగా మీడియా ముఖంగా బహిరంగంగా నిజాన్ని ఒప్పుకోవడం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story