Payal Rajput: నా నిజ జీవితాన్ని చూడాలనుకుంటేనే రండి.. హాట్ పిక్స్ కోసం కాదు : పాయల్ రాజ్ పుత్
పాయల్ రాజ్ పుత్

Payal Rajput: సెలబ్రిటీల ఇన్‌స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ ఫీచర్.. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే కదా! తాజాగా ఈ లిస్ట్‌లోకి చేరిపోయారు నటి పాయల్ రాజ్‌పుత్. తన ఇన్‌స్టా అకౌంట్‌కు సబ్స్క్రిప్షన్ ఫీచర్ పెట్టడమే ఆలస్యం.. కొందరు నెటిజన్లు ఆమెపై ట్రోలింగ్ మొదలుపెట్టేశారు.అయితే ఈ ట్రోలర్స్‌కు పాయల్ గట్టిగానే సమాధానమిచ్చారు. అసలు తన సబ్స్క్రిప్షన్ ఛానల్‌లో ఎలాంటి కంటెంట్ ఉండబోతుందో క్లియర్ కట్‌గా స్పష్టం చేశారు.
పాయల్ మాటల్లోనే చెప్పాలంటే.."నా ఛానల్‌లో ఎలాంటి కంటెంట్ షేర్ చేయబోతున్నాననే దానిపై చాలా మంది మెసేజ్ లు చేస్తున్నారు. నేను ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. ఒకవేళ మీరు 'హాట్ పిక్స్', 'బోల్డ్ కంటెంట్' ఆశించి సబ్స్క్రిస్క్రైబ్ చేసుకోవాలనుకుంటే.. మీకు ఇది అస్సలు సరైన ఛానల్ కాదు.తెర వెనుక ఉండే నా నిజమైన జీవితాన్ని, నా వ్యక్తిగత అభిప్రాయాలను చూడాలనుకునే వాళ్లు మాత్రమే ఇందులో జాయిన్ అవ్వండి. అంతకు మించి మరేమీ ఆశించవద్దు. నా వ్యక్తిగత పరిధిని గౌరవిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు అంటూ పాయల్ తేల్చి చెప్పేశారు. గ్లామర్ ప్రపంచానికి అవతల పాయల్ రియల్ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకునే వాళ్లకే ఈ సబ్స్క్రిప్షన్ అన్నమాట.

