సినిమా హాస్య నటుడు ఫిష్ వెంకట్ (అసలు పేరు వెంకట్ రాజ్) ఇవాళ శుక్రవారం రాత్రి తీవ్రమైన కిడ్నీ, లివర్ వైఫల్యంతో హైదరాబాద్ లో కన్నుమూశారు. ఆయన గత కొన్ని నెలలుగా డయాలసిస్ చేయించుకుంటూ ఉండేవారు. ఇటీవల ఆయనను వెంటిలేటర్ పై ఉంచారు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ కోసం డోనర్ దొరకకపోవడంతో ఆయన పరిస్థితి మరింత దిగజారి మరణించారు.

ఫిష్ వెంకట్ తెలంగాణ యాసతో హాస్య పాత్రలు పోషించి ప్రేక్షకులను అలరించారు. గబ్బర్ సింగ్, అధుర్స్, డీజే తిల్లు వంటి చిత్రాల్లో నటించారు. ఆయన కుమార్తె శ్రావంతి ఆర్థిక సాయం కోసం అభ్యర్థించగా, పవన్ కల్యాణ్, విశ్వక్ సేన్ వంటి నటులు సహాయం అందించారు.

Politent News Web3

Politent News Web3

Next Story