Keerthy Suresh Shares Interesting Insights: కామెడీ చేయడం అతి కష్టం.. కీర్తి సురేష్ ఆసక్తికర వ్యాఖ్యలు
కీర్తి సురేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

Keerthy Suresh Shares Interesting Insights: కథల ఎంపికలో ఆచి తూచి అడుగులేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న భామ కీర్తి సురేష్, ఇటీవల విడుదలైన రివాల్వర్ రీటా క్రైమ్ కామెడీ చిత్రంలో తుపాకీ చేతపట్టి అభిమానులను ఆకట్టుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె కామెడీ జానర్‌లో నటించడం గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు. కీర్తి సురేష్ మాట్లాడుతూ.. కామెడీ అనేది అత్యంత కష్టమైన భావోద్వేగమని అన్నారు. "కామెడీ అనేది అత్యంత కష్టమైన భావోద్వేగం. ఎందుకంటే ఒకరిని నవ్వించడం అనేది అంత సులభమైన విషయం కాదు." అని చెప్పారు. అయితే రివాల్వర్ రీటాలో తాను పోషించిన పాత్ర తన వ్యక్తిత్వానికి చాలా దగ్గరగా ఉందని, ఈ జానర్‌లో పనిచేయడం మంచి అనుభవమని ఆమె తెలిపారు.
"ఒత్తిడిలో ఉన్నప్పుడు ఇలాంటి చిత్ర షూటింగ్‌లో పాల్గొంటే రిఫ్రెషింగ్‌గా అనిపిస్తుంది. ఇది ఓ పది సార్లు పేపర్లను చదువుతూ.. మాటల్ని రిహార్సల్స్ చేసే సినిమా కాదు. అనుకోకుండానే ఇలాంటి కామెడీ సినిమాల్లో జీవించేస్తాం" అని కీర్తి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కీర్తి సురేష్ ఖాతాలో కన్నెవెడి అనే చిత్రం ఉంది. ఈ సినిమాతో పాటు మరిన్ని ఆసక్తికర ప్రాజెక్ట్‌లు త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.

