డైరెక్టర్ రాజమౌళిపై ఫిర్యాదు

Complaint Filed Against Director Rajamouli: దర్శకుడు రాజమౌళిపై హైదరాబాద్ సరూర్ నగర్ పీఎస్ లో కేసు నమోదైంది. మహేష్ బాబుతో చేస్తున్న సినిమా (వారణాసి/Varanasi) టైటిల్ లాంచ్ ఈవెంట్‌లో, రాజమౌళి హనుమంతుడిపై చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని రాష్ట్రీయ వానరసేన సభ్యులు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫిర్యాదును స్వీకరించారు కానీ ఇప్పటివరకు కేసు నమోదు చేశారా లేదా అనే దానిపై విచారణ జరుగుతోందని కొన్ని వర్గాలు చెబుతున్నాయి.

రామోజీ ఫిలీం సిటీలో జరిగిన Globe Trotter ఈవెంట్లో సాంకేతిక లోపం (Technical Glitch) వచ్చినప్పుడు రాజమౌలి అసహనానికి గురై, "నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదు. మా నాన్నగారు వచ్చి ఇందాక 'హనుమంతుడు వెనుక ఉంటాడు, నడిపిస్తాడు' అని చెప్పారు. ఇది అయిన వెంటనే నాకు కోపం వచ్చింది. నా భార్య మీద కూడా కోపం వచ్చింది. ఇలానేనా ఆయన చేసేది అనిపించింది" అని వ్యాఖ్యానించారు.ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు నెటిజన్లు రాజమౌళి తీరుపై విమర్శలు చేస్తున్నారు. దీనికి దేవుడిని నిందించడమేంటని ప్రశ్నిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story