స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..?

'Coolie' on OTT: రజనీకాంత్‌, లోకేష్‌ కనగరాజ్‌ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'కూలీ' (Coolie) ఓటీటీలోకి రాబోతోంది. ఈ సినిమా సెప్టెంబర్ 11, 2025న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ అమెజాన్‌ సరికొత్త పోస్టర్‌ను పంచుకుంది.ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్లలో విడుదలై మంచి వసూళ్లను రాబట్టింది. అయితే, థియేటర్ల విడుదల తర్వాత దాదాపు ఒక నెలలోనే ఈ సినిమా ఓటీటీలోకి వస్తోంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మరియు మలయాళ భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులోకి వస్తుంది. 'కూలీ' సినిమా డిజిటల్ హక్కులను ప్రైమ్ వీడియో రూ. 120 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇది ఇప్పటివరకు తమిళ సినీ పరిశ్రమలో జరిగిన అతిపెద్ద డిజిటల్ డీల్స్‌లో ఒకటిగా చెప్పబడుతోంది. ఈ సినిమా విడుదల రజనీకాంత్ సినీ జీవితంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని జరిగింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story