ట్రైలర్ ఎపుడంటే.?

'Coolie' Trailer Release Date Revealed: లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రజినీకాంత్ నటిస్తున్న కూలీ సినిమాపై భారీ అంచనాలున్నాయి. నాగార్జున నెగటివ్ , ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, శ్రుతి హాసన్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ కూడా ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తు్న్నారు.

ఈ సినిమా బంగారం అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెకినట్లు తెలుస్తోంది. నాగార్జున విలన్ పాత్రలో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా ట్రైలర్ అప్ డేట్ ఇచ్చింది టీం. ట్రైలర్ ను ఆగస్టు 2న రిలీజ్ చేస్తామని చెప్పింది. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ట్రైలర్ ఈవెంట్ నిర్వహించనుంది. ఈ వేడుకకు నాగార్జున,రజినీ కాంత్ కూడా హాజరవుతారని తెలుస్తోంది.

దాదాపు రూ. 350 కోట్ల భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగులో ఏషియన్ సునీల్ నారంగ్, సురేష్ బాబు, దిల్ రాజ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 14 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా ఓటీటీ హక్కులను రూ. 120 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం.

PolitEnt Media

PolitEnt Media

Next Story