కూలీ, వార్ -2 .. బాక్సాఫీస్ కలెక్షన్లు ఎన్నికోట్లు.?
బాక్సాఫీస్ కలెక్షన్లు ఎన్నికోట్లు.?

రాజనీకాంత్ నటించిన కూలీ , హృతిక్ రోషన్ ,జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'వార్ 2' సినిమాలు ఒకేరోజు ఆగస్టు 14న విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర ఎన్ని కోట్లు కలెక్ట్ చేశాయో ఓకసారి చూద్దాం మంచి వసూళ్లు సాధించాయి.
కూలీ (Coolie) వసూళ్లు
ప్రపంచవ్యాప్త వసూళ్లు: 'కూలీ' సినిమా విడుదలైన 12 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.500 కోట్లకు పైగా వసూలు చేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఇండియాలో ఈ సినిమా 12 రోజుల్లో దాదాపు రూ.260.35 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది.
ఈ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.151 కోట్లు వసూలు చేసి, ఒక తమిళ చిత్రానికి అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్లు సాధించిన రికార్డును నెలకొల్పింది. వీకెండ్‌లో వసూళ్లు పెరిగాయి, కానీ వర్కింగ్ డేస్‌లో కొంత తగ్గుదల కనిపించింది. అయినప్పటికీ, ఇది వార్ 2' కంటే ముందుంది.
వార్ 2 (War 2) వసూళ్లు
వార్ 2' సినిమా 12 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.340.15 కోట్లు వసూలు చేసింది. ఇండియాలో ఈ సినిమా 12 రోజుల్లో దాదాపు రూ.224.15 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది.ఈ సినిమా తొలి రోజు రూ.52 కోట్లు వసూలు చేసి, మంచి ఓపెనింగ్ సాధించింది. ముఖ్యంగా హిందీ, తెలుగు మార్కెట్‌లలో ఈ సినిమా బాగా ఆడింది. కానీ, వీక్ డేస్‌లో, ముఖ్యంగా రెండవ వారంలో వసూళ్లు గణనీయంగా తగ్గాయి. ఇది రూ. 200 కోట్ల క్లబ్‌లో చేరినప్పటికీ కూలీ కంటే వెనుకబడింది.
